టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినీ కెరీర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లు ఉండగా కొన్ని దారుణమైన ఫలితాలు మిగిల్చిన సినిమాలు కూడా ఉన్నాయి. పూరి జగన్నాథ్ కి కథ నచ్చితే ఏది ఆలోచించకుండా సినిమాలు తీస్తాడు. అయితే ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక ప్రేక్షకులకు నచ్చే అంశం ఉంటుంది.ఫ్లాప్ అయినా కూడా ఆ సినిమాలు ప్రేక్షకులు విపరీతంగా అభిమానిస్తారు. అయితే ఆవిధంగా కూడా నచ్చని, ప్రేక్షకులు మెచ్చని సినిమా పూరి జగన్నాథ్ కెరీర్ లో ఒకటి ఉందట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. తను డైరెక్ట్ చేసిన సినిమాల్లో ఒక మూవీ చెత్త మూవీ పూరి జగన్నాథ్ స్వయంగా ఒప్పుకున్నాడు. 

రవితేజ హీరోగా నటించిన దేవుడు చేసిన మనుషులు చిత్రం ఆయన కెరీర్లోనే అత్యంత చెత్త సినిమా అని ఒప్పుకున్నాడు. భిన్నమైన టైటిల్స్ తో హిట్ లు సాధిస్తూ పూరి జగన్నాథ్ దూసుకెళ్తున్నాడు. అంతేకాదు హీరో పాత్రను డిజైన్ చేయడంలో, వాళ్లకు వాళ్ళ బాడీలాంగ్వేజ్ కు, ఫ్యాన్స్ కి తగ్గట్లు డైలాగ్స్ రాయడంలో అయినా ప్రత్యేక శైలి ఉంది. పూరి జగన్నాథ్ ఆవిధంగానే పోకిరి, దేశముదురు,ఇడియట్, టెంపర్ సినిమా లలో హీరోనీ ఏ దర్శకుడు చూపించనీ విధంగా చూపించి పూరి జగన్నాథ్ ఆ సినిమాలతో హిట్ రిజల్ట్ సొంతం చేసుకున్నారు.

ఇక డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రవితేజ తో దేవుడు చేసిన మనుషులు సినిమా తో పాటు చాలా సినిమా లు తెరకెక్కించాడు.   ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం, ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి ఈ మూడు సినిమాలు కాకుండా నేనింతే, దేవుడు చేసిన మనుషులు సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కాయి. అయితే వీటిలో అన్ని సినిమాలకు మంచి పేరు వచ్చిన దేవుడు చేసిన మనుషులు సినిమా మాత్రం దారుణమైన ఫ్లాప్ అయ్యింది.  ఆ సినిమాలో పాయింట్ ను సరిగ్గా చెప్పలేక పోయాను అని తన లైఫ్ లో తీసిన చెత్త సినిమా ఇదేనని చెప్పుకొచ్చాడు.  ఇప్పుడు లైగర్ సినిమా పైనే తన దృష్టి పెట్టాను అని పూరి జగన్నాథ్ చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: