
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆచార్య త్వరలోనే విడుదల కానుంది. సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ ను జోడించి సినిమాలు తీయడం లో ఘనాపాటి అయినా కొరటాల శివ ఈ సినిమాను కూడా తన పాత సినిమాలలాగానే ఎంతో వైవిధ్యభరితంగా తెరకెక్కించాడు. మిర్చి సినిమాతో దర్శకుడిగా మారిన కొరటాల శివ ఆ తరువాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అను నేను అనే హిట్ సినిమాలతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. కొరటాల శివ సినిమా తో సినిమా అంటే తప్పకుండా విజయం సాధిస్తుంది అని నమ్మకాన్ని ఏర్పరుచుకున్నాడు హీరోలలో.
ఇంతవరకు ఒక అపజయాన్ని కూడా లేకుండా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హిట్ సినిమాలు చేసుకుంటూ వచ్చిన కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో కూడా అదే రేంజ్ లో ఆచార్య సినిమాను తెరకెక్కించాడు అని ఆమధ్య వచ్చిన టీజర్ ను బట్టి తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మామూలు విషయం కాదు. ఇంత త్వరగా అంత పెద్ద హీరోతో సినిమా చేయడం నిజంగా కొరటాల శివ అదృష్టమనే చెప్పుకోవాలి. వాస్తవానికి చిరంజీవి ఏ దర్శకుడి తో పనిచేసిన కూడా చిరంజీవి ప్రభావమే సినిమా పై ఎక్కువగా ఉంటుంది. కానీ సినిమాలో మాత్రం శివ మేజిక్ ఎక్కువగా కనిపించబోతుందని చిత్ర బృందం చెబుతుంది.
చిరంజీవి కథకు తగ్గట్టుగా నటించడం, కొరటాల శివ తన స్టైల్లో సినిమాను తెరకెక్కించడం వల్లే ఇది సాధ్యమైందని సినిమా యూనిట్ అంటుంది. ఇక పోతే ఈ సినిమాలో చిరు జోడీ గా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పూజా హెగ్డే మరో జంట గా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందించగా ఈ సినిమా నుంచి వచ్చిన ఓ పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచి సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. కరోనా వలన మేలో విడుదల కావాల్సిన మే లో విడుదల కావాల్సిన సినిమా ఆగిపోగా కొత్త రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.