టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాణ సంస్థల్లో 'మైత్రీ మూవీ మేకర్స్' మొదటి స్థానంలో ఉంది.ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో భారీ లాభాల్ని ఆర్జిస్తున్నారు మైత్రీ నిర్మాతలు. స్టార్ హీరోల దగ్గర్నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు పక్కాగా సినిమాలను ప్లాన్ చేస్తూ ఓ స్పెషల్ బ్రాండ్ ని ఏర్పరచుకుంది.ప్రస్తుతం అల్లు అర్జున్ పాన్ ఇండియన్ మూవీ 'పుష్ప' సినిమాతో పాటూ మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు కొత్తగా ముగ్గురు హీరోలతో కొత్త ప్రాజెక్టులను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.అక్కినేని అఖిల్, శ్రీవిష్ణు,గోపిచంద్..ఈ ముగ్గురు హీరోలతో కొత్త సినిమాలను నిర్మిచనుంది మైత్రీ.

ఇప్పటికే ఈ హీరోలకు అడ్వాన్సులు కూడా ఇచ్చేసారట.నిజానికి అఖిల్ తో ఎప్పటినుంచో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు.అఖిల్ సినిమా కోసమే డైరెక్టర్ అజయ్ భూపతిని సెట్ చేయాలని అనుకున్నారు.కానీ అజయ్ చెప్పిన కథ,అఖిల్ కి అంతగా నచ్చలేదు.దాంతో ఈ కాంబో సెట్ అవ్వలేదు.ఈ నేపథ్యంలో ఓ కొత్త డైరెక్టర్ చెప్పిన కథ అఖిల్ కి బాగా నచ్చింది.అందుకే అఖిల్ కోసం ఆ కొత్త డైరెక్టర్ ని లైన్లో పెట్టింది మైత్రీ.ఇక ప్రెస్5అఖిల్ చేతిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, సురేందర్ రెడ్డి ఏజెంట్ సినిమాలు ఉన్నాయి.

ఈ రెండు సినిమాల తర్వాత మైత్రీ సంస్థ లో సినిమా ఉంటుంది. ఇక గోపిచంద్ హీరోగా మైత్రీ నిర్మాణ సంస్థ లో తెరకెక్కనున్న సినిమాకి అజయ్ భూపతి దర్శకుడు.ఇక శ్రీ విష్ణు సినిమాని డైరెక్ట్ చేసేది కూడా కొత్త దర్శకుడే కావడం గమనార్హం.మొత్తానికి వరుస ప్రాజెక్టులను నిర్మిస్తూ టాలీవుడ్లో నంబర్ వన్ ప్లేస్ కి చేరింది మైత్రీ మూవీ మేకర్స్. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప తో పాటు బాలకృష్ణ, గోపిచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక వీటి తర్వాతే ఈ ముగ్గురు హీరోలతో వరుస ప్రాజెక్టులను ప్లాన్ చేశారు మైత్రీ నిర్మాతలు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: