ఇటీవలే సెలబ్రిటీ హోదాను సంపాదించిన కొంతమంది తప్పుతాగి రోడ్డుమీద రచ్చ చేస్తుండడం మనం చూశాం. కొంతమంది డ్రింక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతే ఇంకొంతమంది యాక్సిడెంట్లు చేయడం మరికొంతమంది తాగిన మత్తులో అరచుకుంటూ వెళ్లడం వంటివి మనం చూశాం. సెలబ్రిటీ హోదా తెచ్చుకున్న తర్వాత ఎంతోకొంత బాధ్యతగా వ్యవహరిస్తూ ప్రజలకు మంచి చేసి చూపించాలే ఈ విధంగా చేయడం ఎంత మాత్రం భావ్యం కాదు అని చాలామంది హెచ్చరించారు. అయినా సెలబ్రిటీలు ఇలా రచ్చ చేయడం మాత్రం మానుకోలేదు.

తమిళ బిగ్ బాస్ ఫేమ్ యషిక ఫేమ్ కారు యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. అర్ధరాత్రి సమయంలో అతి వేగంగా కారు డ్రైవ్ చేస్తూ రావడం వల్ల కారు ఢీ కొట్టి పల్టీలు కొట్టినట్లుగా ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. కారు వేగం యాక్సిడెంట్ అయిన పరిస్థితి చూస్తుంటే డ్రైవ్ చేస్తున్న వారు పీకలదాకా మద్యం తాగి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు పోలీసులు. అయితే కారులో ఉన్న యశిక స్నేహితురాలు అక్కడికక్కడే మృతి చెందగా ఆమె మాత్రం తీవ్ర గాయాలతో బయటపడింది. 

గాయాలపాలై ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డ యషిక ను పోలీసులు ఇప్పటికి వదిలేలా లేరు. ప్రత్యక్ష సాక్షులు మరియు ఇతర విషయాలను పరిశీలించిన తర్వాత యాక్సిడెంట్ కారణం యషిక అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే ఆమె కోలుకున్న తర్వాత విచారించడానికి సిద్ధమవుతున్నట్లుగా తమిళ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్న యషిక కోలుకున్న తర్వాత ఆమెను ఈ కలిసి యాక్సిడెంట్ కేసు గురించి విచారణ జరుపుతామని పోలీసులు వెల్లడించారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో విపరీతంగా మద్యం సేవించి డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని, పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ విషయంపై యషిక స్పందన ఏంటి అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు పెద్దగా ప్రమాదం లేదని, తొందర్లోనే కోలుకుంటోంది డాక్టర్ లు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: