ప్రస్తుతం
సినిమా ఇండస్ట్రీ ల లో నడుస్తున్న ట్రెండ్ ఏంటి అంటే సినిమాలు థియేటర్లలో కాకుండా మరో ప్రత్యామ్నాయంగా ఓటీటీ సంస్థలలో విడుదల అవడం. ఓ టీ టీ సంస్థలలో సినిమాలు విడుదల చేసిన నిర్మాతలు కొంత వరకు లాభలు పొందుతున్న అయితే తక్కువ ధరలు మాత్రమే సినిమాలకు ఇస్తూ ఓటు సంస్థలు సినిమాలను దారుణంగా మోసం చేస్తున్నాయని ఓ వర్గం వాదిస్తోంది. ఇకపోతే
సినిమా థియేటర్లలో వచ్చినప్పుడు ఎలాంటి విధానం అయితే కొనసాగిందో అదే విధానాన్ని ఇప్పుడు ప్రేక్షకులు ఓటీటీ సంస్థలలో విడుదలయ్యే సినిమాల పరంగా కూడా కొనసాగిస్తున్నారు.
కాస్త ఇమేజ్ వున్న హీరోల సినిమాలను కూడా జనాలు అప్పట్లో ధియేటర్లో చూసే వారు కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఓ టీ టీ లో చూస్తున్నారు. కొంత ఇమేజ్ ఉన్న హీరోల సినిమాలను అసలు చూడడం లేదు. ఓ టీ టీ లు బాగా అలవాటు అయిపోవడంతో థియేటర్లకు రావడం తగ్గించడం చేస్తున్నారు చాలా మంది ప్రేక్షకులు. అయితే ఓ టీ టీ లో అందుబాటులో ఉన్న ప్రతి
సినిమా చూడడం లేదు. అందులో కూడా సెలెక్ట్ గా టాక్ బాగా ఉంది అన్న సినిమాలు మాత్రమే ఎంచుకుని చూస్తున్నారు. బోలెడంత కంటెంట్ అందుబాటులో ఉండడంతో చాలా బాగుంది అన్న సినిమాలను మాత్రమే వారు ఎంచుకుని చేసుకుంటున్నారట.
ప్రపంచ సినిమాతో పాటు ఎన్నో భాషల్లో వెబ్ సిరీస్ లు బోలెడన్ని అరచేతిలోకి అందుబాటులోకి వచ్చేయడంతో ఏది చూడాలన్నా దాన్ని చాలా బాగుంటే కానీ చూడడానికి ఇష్టపడట్లేదు . సెలెక్టివ్గా సినిమాలు మాత్రమే చూస్తున్నారు. ఇలాంటి సమయంలో వారి దృష్టిని ఆకర్షించి ఒక
సినిమా చూపించడం అనేది ఎంతో కష్టమైపోతుంది.
టీవీ లో కాస్త ఫేమ్ వచ్చింది కదా అని
హీరో అయితే ప్రేక్షకులు వాళ్లను నెత్తిన పెట్టుకోవడం లేదు. ఈ నేపథ్యంలో మన మన హీరోలే మెప్పించే స్థాయిలో లేకపోతే మన ప్రేక్షకులు ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.