ఇటీవలే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో రీమేక్ సినిమాలు తీసే హీరోల సంఖ్య రోజురోజుకు ఎక్కువైపోతుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రెండు రీమేక్ సినిమాలు చేస్తుంటే వెంకటేష్ కూడా రెండు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్రీమేక్ సినిమా చేస్తూ ఉన్నాడు. ఇంకా యంగ్ హీరోలు సైతం రీమేక్ సినిమా ల పై ఇంట్రెస్ట్ చూపిస్తూ సేఫ్ జోన్ లోకి సినిమా లు చేస్తున్నారు.  అయితే ఇక్కడే అసలు ప్రమాదం ఉంది. రీమేక్ సినిమాలు చేయడం వలన హిట్లు కొడతారేమో కానీ ప్రేక్షకుల్లో క్రేజ్ మాత్రం తగ్గిపోతుంది.

ఇప్పటికే విడుదలైన చాలా రీమేక్ సినిమాల పట్ల క్రేజ్ లేకపోవడం వాటికి ఉదాహరణలు. ముఖ్యంగా మలయాళం సినిమా పరిశ్రమ నుంచి మనవాళ్లు రీమేక్ సినిమాలు చేయడం ఎక్కువ అయిపోతుంది. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా మలయాళ సినిమాలు తెలుగులో డబ్ అవుతుండగా ఇప్పుడు డైరెక్ట్ రీమేక్ సినిమాలు చేసే విధంగా మనవాళ్లు ఆలోచిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫజిల్  హీరోగా నటించిన మాలిక్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కాగా మత ఘర్షణలను, రాజకీయ నేపథ్యంలో సాగే ఈ సినిమా కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది.

తెలుగులో రానా హీరోగా మాలిక్ సినిమా నీ రీమేక్ చేయాలని భావిస్తున్నారట. ఇటీవల ఈ సినిమా చూసిన రానా తెలుగులో తాను హీరోగా ఈ సినిమా తీస్తే బాగుంటుందని దీన్ని ప్లాన్ చేశారట. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారట. అరణ్య సినిమా తో రానా భారీ ఫ్లాప్ అందుకోగా రానా ఇప్పుడు విరాటపర్వం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా థియేటర్ రిలీజా, ఓ టీ టీ రిలీజా అనే  అయోమయంలో ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఈ రీమేక్ సినిమా చేసే ఆలోచనలో రానా ఉన్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: