ఒకప్పుడు సినిమా కలెక్షన్లు పదికోట్ల దాటాయంటే ఆ సినిమాను సూపర్ హిట్ అనేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది 100 కోట్లు దాటితే కానీ ఆ సినిమా బ్లాక్ బాస్టర్ లిస్ట్ లోకి ఎక్కదు. ఎందుకంటే అప్పటి మూవీ బడ్జెట్లు వేరే ఇప్పటి మూవీ బడ్జెట్లు వేరే, అలా ఆ లెక్కమారింది. కాబట్టి సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది అంటే ఆ చిత్రం రికార్డు బద్దలు కొట్టింది అని అర్దం. కానీ ఈ టార్గెట్ రీచ్ కావడం అన్ని సినిమాల వల్ల  అయ్యే పనికాదు. విషయం ఉంటేనే కానీ ఇంతటి సక్సెస్ అందుకోవడం కష్టం. అయితే టాలీవుడ్ లో 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన అద్భుతమైన చిత్రాలలో "రంగస్థలం" కూడా ఒకటి. విభిన్న కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ను స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేశారు. ఇందులో రామ్ చరణ్ తేజ్, సమంత లు హీరో హీరోయిన్లుగా చేయగా, ప్రకాష్ రాజ్, ఆది పినిశెట్టి, నరేష్, అనసూయ వంటి వారు ముఖ్య భూమికలు పోషించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమా ఓ సంచలనం. వసూళ్ల సునామీతో బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల మోత మోగింది. 

సినిమాలు ఒక జోనర్ లో వెళుతున్న టైం లో ఒక విభిన్న నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించి అద్భుతం సృష్టించింది. అప్పటి వరకు  ఆర్య, ఆర్య 2, నాన్నకు ప్రేమతో వంటి ప్రేమకథ చిత్రాలతో విజయాలను అందుకున్న సుకుమార్ రంగస్థలం లాంటి కంప్లీట్ డిఫరెంట్ జోనర్ లో సినిమా తీసి అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. సినిమా అంటే ఆ సీన్ బాగుంది, ఈ లైన్ బాగుంది అని చెబుతుంటారు. కానీ ఇందులో ప్రతీ సీన్ ఒక అద్భుతమే. ప్రతి పాత్ర ఆడియన్స్ మనసుని హత్తుకుంది. ముఖ్యంగా చిట్టిబాబు పాత్రలో చరణ్‌ను, అలాగే రామలక్ష్మి పాత్రలో సమంతని తప్ప మరెవరినీ ఊహించుకోలేము అంతగా ఒదిగిపోయి అలరించారు. ఫామ్ లో ఉన్న ఒక యంగ్ స్టార్ హీరోయిన్ ఢీ గ్లామరస్ పాత్ర చేయడమంటే నిజంగా చాలా డేర్ ఉండాలి. అలాంటిది సామ్ నమ్మకంగా ఒకే చెప్పడమే కాకుండా అలవోకగా ఒక పక్కా పల్లెటూరి అమ్మాయి పాత్రలో జీవించారు. ఈ మూవీలో చెర్రీ పాత్ర గురించి ఎంత చెప్పినా, ఎంత ప్రశంసించినా తక్కువే అవుతుంది.

ఆఫ్టర్ రంగస్థలం మూవీ చిట్టి బాబు అనే పేరు వింటే చెర్రీ తప్ప మరెవరూ గుర్తుకురారు అనడంలో సంకోచం లేదు. ఇక రంగమ్మత్తగా నటించిన అనసూయకి స్టార్ డం అమాంతం పెరిగిపోయింది. అలా ఒక్కో పాత్రను ప్రేక్షకులు మెచ్చేలా డిజైన్ చేశారు డైరెక్టర్ సుకుమార్.  ఇక పాటల విషయానికొస్తే దేవి శ్రీ ప్రసాద్ తన టాలెంట్ ను, ఎక్స్పీరియన్స్ ను కలగలిపి ప్రాణం పెట్టీ సంగీతాన్ని సమకూర్చారు. ప్రతి పాట హైలెట్టే. "రంగమ్మ మంగమ్మ" పాట మునుపెన్నడూ ఏ పాట అందుకొని రీతిలో వ్యూస్ దక్కించుకుని అరుదైన రికార్డు ను దక్కించుకుంది. నేటికి అంతే స్పీడ్ తో లక్షల వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఇలాంటి  పొలిటికల్, ఎమోషనల్ డ్రామాను అందులోనూ అలాంటి కథనంతో ఆడియన్స్ కి ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఏకదాటిగా  మూడు గంటల పాటు తెరపై ఆసక్తికరంగా నడిపించడం అంటే అది దర్శకుడు సుకుమార్‌కు చేసిన మ్యాజిక్ అనే చెప్పాలి. ఈ సినిమా 60 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి టోటల్ రన్ లో 216 కోట్లను కలెక్ట్ చేసి రికార్డు గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: