ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలను తెరకెక్కించే శేఖర్ కమ్ముల..తన దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాలో ప్రముఖ డ్యాన్సర్ అలాగే హీరోయిన్ గా గుర్తింపు పొందిన సాయి పల్లవి కూడా నటించి సినిమాకు హైలెట్ గా నిలిచింది. అంతేకాదు నాగచైతన్య సినీ జీవితంలో ఇది ఒక అతి పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పవచ్చు. కులాంతర ప్రేమ వివాహాలతో వచ్చిన సినిమాలు ఎప్పుడైనా మంచి విజయాన్ని సాధించినట్లే.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ కులాంతర ప్రేమ వివాహం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.. నాగచైతన్య జీవితంలో ఒక్క సమంత విడిపోకుండా ఉండి ఉంటే ఇంకా బాగా మంచి విజయాన్ని అందుకునేవాడని చెప్పవచ్చు.
ఇక అఖిల్ అక్కినేని కూడా ఇప్పటివరకు కనీసం ఏ సినిమాతో కూడా యావరేజ్ గా నిలిచింది లేదు.. ఇక దసరా పండుగ సందర్భంగా విడుదలైన అక్టోబర్ 15వ తేదీన విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. ఇక ఈ సినిమా కూడా మొదటి షో తోనే మంచి సక్సెస్ టాక్ ను అందుకుంటోంది. ఇక ఇలా ఈ సంవత్సరం అక్కినేని అఖిల్ కి అలాగే అక్కినేని నాగచైతన్యకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.. సినిమాల పరంగా బాగా కలిసి వచ్చినా నాగాచైతన్య కు మాత్రం వైవాహిక జీవితంలో ఈ సంవత్సరం ఏమాత్రం కలిసిరాలేదు.