తెలుగు సినీ ఇండస్ట్రీలో సిల్క్ స్మిత అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. 1980 సంవత్సరం చివరి నుండి హాట్ డాన్సర్ గా గుర్తింపు పొందింది. ఇక ఈమె జీవిత కథ ఆధారంగా డర్టీ పిక్చర్ అనే మూవీను కూడా తీయడం జరిగింది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు తాజాగా సిల్క్ స్మిత రేర్ పిక్ ఒకటి వైరల్ గా మారింది.


ఈ ఫోటో సిల్క్ స్మిత చాలా చిన్న వయసులోనే దిగిన ఫోటోలా కనిపిస్తోంది. ఈ ఫోటోలో సిల్క్ స్మిత చాలా అందంగా కనిపిస్తోంది. కానీ తన అందమైన జీవితాన్ని మాత్రం ఒక విషాదకరమైన రీతిలో ముగించింది. అందుకు కారణం ఆమె కెరీర్ లో కొన్ని ఒడిదుడుకులు, మద్యపానం వంటి వాటికి అలవాటుపడి తన కెరీర్ని నాశనం చేసుకుంది. అన్న వార్తలు అప్పుడు  సినీ ఇండస్ట్రీలో బాగా వినిపించాయి.

సిల్క్ స్మిత 200కు పైగా చిత్రాల్లో నటించింది. తెలుగు లోనే కాకుండా ఇతర భాషలలో సైతం తన మార్కును వేసుకుంది. ఇక ఎక్కువగా శృంగార సినిమాలలో నటించింది సిల్క్ స్మిత. అంతేకాదు సిల్క్ స్మిత నటనతో, డాన్సులతో బాలీవుడ్ నిర్మాతలు కాసుల కొల్లగొట్టారు.కానీ సౌత్ లో మాత్రం సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా సినిమా తీసే ప్రయత్నం ఎవరు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇకపోతే సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. 1960వ సంవత్సరం డిసెంబర్ 2వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు దగ్గర్లో ఉన్న అతి నిరుపేద కుటుంబంలో జన్మించింది..


ఇక వీరి తల్లిదండ్రులు.. పిల్లల చదువులు చదివించలేక ఇబ్బంది పడుతున్న సమయంలోనే, ఆమె నాలుగవ తరగతి వరకు చదివి, తన చదువుకు స్వస్తి చెప్పి, సినీ నటి కావాలని మద్రాస్ వెళ్ళింది. ఇక మొదటి సారి 1979లో విడుదలైన  వండి చక్రం అనే సినిమా ద్వారా ఈమె తన సినీ జీవితాన్ని మొదలు పెట్టింది. ఇక అక్కడే ఈమె పేరును సిల్క్ స్మిత గా మార్చడం కూడా జరిగింది.ఇక అలా  విజయలక్ష్మి కాస్త సిల్క్ స్మిత గా మారి సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపింది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: