ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తూ టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటుంది  బిగ్ బాస్ తెలుగు ఐదవ సీజన్. అయితే 19 మంది కంటెస్టెంట్ ల తో మొదలైన ఈ బిగ్బాస్ కార్యక్రమం ప్రస్తుతం ఏకంగా ఎనిమిది మందికి చేరుకుంది. ఇక అందరు సభ్యులు ఒక్కో వారం లో ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి బయటికి వెళ్లారు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉండగా టాప్ ఫైవ్ లో ఎవరు నిలువ బోతున్నారు అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఎవరికివారు ప్రత్యేకమైన గేమ్ ఆడుతూ ప్రేక్షకులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో  ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఇక బిగ్బాస్ ఇస్తున్న టాస్క్ లతో హౌస్ మొత్తం వాడివేడిగా మారిపోతుంది. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే ఇటీవలే బిగ్ బాస్ చివరి కెప్టెన్సీ కోసం ఒక టాస్క్ కంటెస్టెంట్ మధ్య గొడవలకు దారి తీసింది. ఇకపోతే ఇటీవలే లగ్జరీ బడ్జెట్ కోసం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ కూడా మరో టాస్క్ ఇచ్చాడు. బుల్లితెర ప్రేక్షకులు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బిగ్బాస్ ఇచ్చిన లగ్జరీ బడ్జెట్ టాస్కులో అటు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎలా ఇబ్బంది పడ్డారు.. టాస్క్ ఎలా పూర్తి చేశారు అన్న విషయాన్ని తెలియజేసేలా ఇటీవలే ఒక ప్రోమో విడుదల చేశారు. ఇక ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమోలో భాగంగా ఇక ఇంటిలోని హౌస్ మేట్స్  అందరూ కూడా లగ్జరీ బడ్జెట్ లో భాగంగా  ఒకరి భుజాల ఒకరు పట్టుకుని అచ్చంగా రైలు బోగి లాగా మారిపోయి పరుగులు పెడుతూ ఉంటారు.. బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాల మేరకు వెనక్కి ముందుకు కదులుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: