మెగాస్టార్ చిరంజీవికి చెల్లెళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. రియల్ లైఫ్ లో చెల్లెళ్లను ఎలా ప్రేమగా చూసుకుంటారో.. అదే విధంగా రీల్ లైఫ్ లో కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అన్నయ్య అని పిలవగానే.. ప్రేమగా వాళ్లను దగ్గరకు తీసుకుంటున్నారు. ఇంతవరకు అన్నయ్య అని పిలిపించుకునే చిరంజీవి.. ఇప్పుడు పెద్దన్నయ్య అయిపోయారు.

హీరోలు సిక్స్‌టీస్‌లో ఉన్నా పడుచుపిల్లలతో కలిసి పాటలు పాడతారని, డాన్సులు చేస్తారని ఇండస్ట్రీలో ఒక ఒపీనియన్ ఉంది. చాలా సినిమాల్లో ఈ ఏజ్‌ గ్యాప్‌ జోడీలపై సెటైర్లు కూడా ఉన్నాయి. అయితే చిరంజీవి ఈ ఫార్మాట్‌కి భిన్నంగా వెళ్తున్నాడు. స్టార్‌ హీరోయిన్స్‌కి పెద్దన్నయ్యగా మారిపోతున్నాడు. చిరంజీవి రీఎంట్రీలో యంగ్‌హీరోయిన్స్‌తోనే సినిమాలు చేశాడు. రామ్‌ చరణ్‌తో ఆడిపాడిన కాజల్, తమన్న లాంటి వాళ్లతో డ్యూయెట్స్‌ పాడాడు. చిరు కూడా కాజల్‌ లాంటి యంగ్‌ హీరోయిన్‌తో సినిమా చేస్తే ఆడియన్స్‌ రిసీవ్‌ చేసుకుంటారా లేదా అని సందేహించానని కొన్ని ఇంటర్వ్యూస్‌లో కూడా చెప్పాడు. మరి ఆ ఆ ఆలోచన నుంచి బయటపడ్డానికో ఏమో స్టార్ హీరోయిన్స్‌కి అన్నయ్యగా మారుతున్నాడు చిరు.

చిరంజీవి ప్రస్తుతం 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత మోహన్‌రాజా దర్శకత్వంలో 'గాడ్‌ఫాదర్' చేస్తున్నాడు. మళయాళీ హిట్‌ 'లూసిఫర్' రీమేక్‌గా తెరకెక్కుతోందీ సినిమా. మళయాళంలో మంజువారియర్ ప్లే చేసిన క్యారెక్టర్‌ని ఇక్కడ నయనతార పోషిస్తోందని సమాచారం.  చిరుకి నయన్‌ చెల్లెలిగా నటిస్తోందని చెప్తున్నారు. ఇంతకుముందు 'సైరా'లో చిరుకి జోడీగా నటించింది నయనతార.

చిరంజీవి తమిళ హిట్ 'వేదళం'ని కూడా రీమేక్‌ చేస్తున్నాడు. మెహర్‌ రమేశ్ దర్శకత్వంలో 'భోళాశంకర్' పేరుతో తెరకెక్కుతోందీ సినిమా. ఇక ఈ మూవీలో కీర్తి సురేశ్‌కి అన్నయ్యగా నటిస్తున్నాడు చిరంజీవి. దీంతో టాలీవుడ్‌లో చాలామందికి అన్నయ్యగా మారిన చిరు, ఇప్పుడు యంగ్‌హీరోయిన్స్‌కి కూడా అన్నయ్యగా మారుతున్నాడని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. చూద్దాం.. సిస్టర్ సెంటిమెంట్ తో చిరంజీవి నటించే సినిమాలు ఏమాత్రం వర్కవుట్ అవుతాయో.

మరింత సమాచారం తెలుసుకోండి: