ఇక ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమాకి సంబందించిన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ అన్ని అందరి నుండి సూపర్ గా రెస్పాన్స్ దక్కించుకోవడం ఈ మూవీపై ఈ అంచనాలు ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లాయి. ఇక ఈ మూవీని వచ్చే నెల 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది. అయితే విషయం ఏమిటంటే, కొద్దిరోజులుగా మన దేశంలో కరోనా కేసులు మెల్లగా పెరుగుతూ ఉండడం, మరోవైపు సరికొత్త వేరియంట్ ఒమిక్రాన్ పంజా విసురుతుండడంతో ఇప్పటికే కేసులు నియంత్రణ చేయడానికి నార్త్ తో పాటు పలు ఇతర రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ లు విధిస్తుండడం, పలు ఆంక్షలు పెడుతుండడం జరుగుతోంది, ఇక త్వరలో మరికొన్ని రాష్ట్రాలు కూడా అదే బాట పట్టనుననట్లు సమాచారం అందుతోంది. దానితో యావత్ అన్ని రంగాలతో పాటు సినిమా పరిశ్రమ కూడా ఒకింత ఆందోళన చెందుతోంది. దీనితో పలువురు రిలీజ్ కి రెడీ అవుతున్న సినిమాల నిర్మాతలు లోలోపల బెంబేలెత్తుతున్నారు. దీనితో జనవరి 7 నుండి ఆర్ఆర్ఆర్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉందని నిన్నటి నుండి పలు వార్తలు మీడియా మాధ్యమాల్లో ఊపందుకోగా, కొద్దిసేపటి క్రితం టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, గవర్నమెంట్ కి ఒక సూచన చేసారు.
ప్రస్తుతం మహమ్మారిలా కొనసాగుతున్న ఈ ఓమిక్రాన్ కట్టడికి అలానే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ సుగమం చేసేందుకు తనదగ్గర ఒక ఐడియా ఉందని తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ పెట్టారు వర్మ. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ మూవీ చూడడానికి రావాలనుకునే ప్రేక్షకులు తప్పనిసరిగా కరోనా రెండు డోసుల టీకా తీసుకుని దాని ప్రూఫ్ చూపితే ఓమిక్రాన్ ని చాలా వరకు అరికట్టవచ్చని, తద్వారా ఆర్ఆర్ఆర్ రిలీజ్ కి కూడా పెద్ద ఇబ్బంది ఉండదని తన పోస్ట్ ద్వారా తెలిపారు వర్మ. అయితే వర్మ పెట్టిన పోస్ట్ పై పలువురు ప్రేక్షకాభిమానులు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి వర్మ ఇచ్చిన సలహా కొంత బాగున్నప్పటికీ అది అసలు ఎంత వరకు వర్కౌట్ అవుతుందో, అలానే దీనిని ఆర్ఆర్ఆర్ టీమ్ సహా ప్రభుత్వాలు ఎంతవరకు అమలు చేసేందుకు ముందుకు వస్తాయో తెలియాలి అంటే దీనిపై వారు స్పందించేంతవరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి