చుట్టూ అందమయిన భామలు
వారితో అచ్చట్లూ ముచ్చట్లూ
సోగ్గాడు మాటలకు
మీసాలున్న చందురుడి మాటలకు
ముగ్ధ మనోహర సోయగాలు ఫిదా
పండుగ వేళ ఇంటిల్లపాదీ కూడా ఫిదానే!
అవును! ఈ సినిమా..పండుగ సినిమా..మన పెద్దల పండుగకు వస్తున్న కొత్త శోభను కలబోసుకుంటున్న సినిమా.ఈ సినిమాను థియేటర్లలోనే చూడాలి అన్న నాగ్ ఆలోచన త్వరలోనే కార్యరూపం దాల్చనుంది. ఎలానూ ఏపీ లోనైట్ కర్ఫ్యూ సడలింపులు ఇచ్చారు కనుక ఇంకేం ఈ పండుగ ఎప్పటిలానే అక్కినేని కుటుంబానిది.. ఏఎన్నార్ లివ్స్ ఆన్....
ట్రైలర్ అదరగొట్టాడు..మామూలుగా కాదు నాగ్ ఫ్యాన్స్ కు పూనకాలే.. అంత బాగుంది..పల్లె వాతావరణంలో నడిచే కథ ..బంగార్రాజు కథ..మామూలుగా కాదు ఓ స్థాయిలో ఉంది ఈ కథ.. అసలు సోగ్గాడే తోనే దుమ్ము దులిపాడు నాగ్.. ఈ సారి కొడుకుతో చాలా అంటే చాలా పోటీ పడ్డారు. అంతకుమించిన స్థాయిలో కథ పై ప్రేమ పెంచుకున్నారు కూడా! ఎవరు చెప్పారు నాగ్ కు వయసు దాటిపోతుందని.ఏం కాదు ఈ సినిమా చూడండి అందమయిన అమ్మాయిలకు లడ్డుండలు తినిపిస్తడు. ఈ సినిమా పాటలు మాత్రమే కాదు డైలాగులు కూడా ఓ మోత మోగిస్తాయి..తూగో యాసలో డైలాగులు చాలా అంటే చాలా బాగా కుదిరాయి అని స్లాంగ్ మొత్తం డైరెక్టర్ కురసాల కల్యాణ్ కృష్ణ దగ్గరే నేర్చుకున్నాను ఇటీవల నాగ్ ఓ మీడియా మీట్ లో చెప్పారు.ఆ మాటను నిజం చేస్తూనే ట్రైలర్ ఉంది.
పండగ లాంటి సినిమా..పండగకు వచ్చేస్తందహో! ఇంకెందుకు ఆలస్యం థియేటర్లకు పోదాం..ఇద్దరు సోగ్గాళ్లతో చిందులేసి,యాభై ఏళ్ల దసరా బుల్లోడిని తల్చుకుందాం..అవును! ఈ పండక్కి దసరా బుల్లోడు (ఎవర్ గ్రీన్ అక్కినేని నటించిన) కు యాభై ఏళ్లు..ఆ ఆనందంతో పాటు అక్కినేని అభిమానులు ఈ ఆనందం కూడా జత!అంటే డబుల్ థమాకా అన్న మాట. డియర్ నాగ్, డియర్ చై ఆల్ ద బెస్ట్.