తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన నటుడిగా రాజకీయ నాయకుడిగా కొనసాగారు నందమూరి తారకరామారావు. ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ రాముడిగా మారిపోయారు ఆయన. ఎందుకంటే అప్పుడు వరకు రాముడిని కేవలం ఫోటోలలో చూడటం తప్ప డైరెక్ట్ గా చూసింది లేదు. కానీ రాముడి పాత్రలో నటించినా నందమూరి తారక రామారావు తెలుగు ప్రేక్షకులందరికీ రాముడు గా మారిపోయాడు. ఎన్నో ఏళ్ల పాటు సినిమాల్లో కొనసాగిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లే ఏకంగా తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా అధిరోహించి సరికొత్త చరిత్ర సృష్టించారు. ఇకపోతే అప్పుడప్పుడు సీనియర్ హీరోల కు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా సీనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక విషయం వైరల్ గా మారిపోయింది. సీనియర్ ఎన్టీఆర్ కు ప్రతి రోజూ ఉదయం లేవగానే చుట్ట తాగే అలవాటు ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని ఆయన తనయుడు బాలకృష్ణ స్వయంగా చెప్పుకొచ్చారు. తనకు కూడా తండ్రి లాగానే చుట్ట తాగే అలవాటు అయ్యింది  అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నందమూరి బాలకృష్ణ. అయితే సీనియర్ ఎన్టీఆర్ కు చుట్ట తాగడం నేర్పించింది ఒక విలన్ అన్న విషయం మాత్రం ఎవరికీ తెలియదు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న ముక్కామల కృష్ణమూర్తి నటసార్వభౌముడు నందమూరి తారక రామారావుకు చుట్ట తాగడం నేర్పించారట. అయితే కాలేజీ రోజుల నుంచే ముక్కామల కృష్ణమూర్తి ఎన్టీఆర్ మధ్య ఎంతో మంచి స్నేహ బంధం ఉండేదట. కాలేజీ సమయంలో ఎన్నో నాటకాల్లో కూడా ఇద్దరూ కలిసి నటించే వారట. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్నేహ బంధాన్ని కొనసాగించారట. ఇక ఆ తర్వాత చుట్ట తాగడం అలవాటు ఉన్న ముక్కామల కృష్ణమూర్తి ఇక ఎన్టీఆర్ కు కూడా చుట్ట తాగడం నేర్పించారట. ఇక అప్పటి నుంచి ముక్కామల ను ధూమపాన గురువుగారు అంటూ ఎన్టీఆర్ పిలిచేవారట.

మరింత సమాచారం తెలుసుకోండి: