ఇతర దర్శకులతో పోలిస్తే క్రిష్ కొంత వెనకబడ్డాడు అనే చెప్పాలి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరిహర వీర మల్లు చిత్రం ఆర్థిక సమస్యలలో చిక్కుకోవడం అనే వార్త ఇప్పుడు ఆయన అభిమానులను తీవ్రంగా కలచి వేస్తోంది. పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఓ చారిత్రాత్మక సినిమాలో నటించబోతున్నాడు అనగానే అందరిలో ఈ సినిమాపై ఎంతో ఆసక్తి నెలకొంది. దానికి తగ్గట్లుగానే ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ ప్రేక్షకులందరినీ అలరించగా ఈ సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు.

ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం భవించగా ఇప్పుడు అది సాధ్యపడదు అని విషయం బయటకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఏ విధంగా కోలుకుంటోందో తెలియదు.  కానీ ఈ ప్రభావం క్రిష్ పై భారీగా ఉంది అని మాత్రం తెలుస్తుంది. గమ్యం సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయమైన ఈ దర్శకుడు ఎక్కువగా సామాజిక స్పృహ ఉన్న సినిమాలను చేసి మంచి దర్శకుడిగా పేరును సంపాదించుకోకలిగాడు. వేదం కంచె వంటి సామాజిక స్పృహ ఉన్న సినిమాలను చేసి మంచి అభిరుచిగల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఆ తరువాత గౌతమీపుత్ర శాతకర్ణి అనే చారిత్రాత్మక సినిమా చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఆ ఎక్స్పీరియన్స్ తో హరి హరి వీర మల్లు అనే సినిమాను చేయడంలో మాత్రం పూర్తిగా వెనుకబడి పోయాడు. పవన్ వేరే సినిమా షూటింగ్ వెళ్లిపోవడంతో కొన్ని రోజులు ఈ చిత్రాన్ని పోస్ట్ ఫోన్ చేసి తాను కూడా కొండపొలం అనే సినిమాను చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ ఎఫెక్ట్ ఇప్పటికీ ఆయన కెరీర్ పై పడుతుందని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఏ విధంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడి క్రిష్ కు విజయాన్ని తీసుకు వస్తుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: