నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ హ్యాట్రిక్ సినిమాగా వచ్చిన అఖండ అంచనాలకు మించి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. సిం హా హిట్.. లెజెండ్ సూపర్ హిట్.. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ తో బోయపాటి శ్రీను, బాలయ్య హ్యాట్రిక్ కాంబో దుమ్ముదులిపేసింది. సినిమాలో బాలయ్య బాబు రెండు పాత్రల్లో అదరగొట్టాడు. ముఖ్యంగా అఖండ సినిమాలో అఘోర పాత్రలో బాలకృష్ణ మరోసారి తన నట విశ్వరూపం చూపించారు. ప్రగ్యా జైశ్వాల్ అందాలు కూడా సినిమాకు ప్లస్ అవగా.. సినిమాకు థమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది.

థియేట్రికల్ రన్ లో బీభత్సాలను సృష్టించిన బాలకృష్ణ అఖండ ఇప్పుడు ఓటీటీలో ఆ రికార్డుల వేట కొనసాగిస్తున్నాడు. డిస్నీ + హాట్ స్టార్ లో అఖండ జనవరి 21 సాయంత్రం నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా ఓటీటీలో సెన్సేషనల్ రికార్డ్ సృష్టించింది. 24 గంటల్లో 1 మిలియన్ స్ట్రీమింగ్ వచ్చ్ అవర్స్ తో రికార్డ్ సృష్టించింది అఖండ. నిజంగానే ఇది నెవర్ బిఫోర్ రికార్డ్ అని చెప్పొచ్చు. తెలుగులో డైరెక్ట్ గా ఓటీటీ రిలీజైన సినిమాలు కూడా ఈ రికార్డ్ ని క్రియేట్ చేయలేదు. అఖండ బీభత్సానికి మరో అదిరిపోయే రికార్డ్ ఖాతాలో పడ్డది.

బాలయ్య బోయపాటి సినిమా అంటే రికార్డులు బద్ధలు కొట్టాల్సిందే అనేలా సినిమాలు వస్తున్నాయి. హ్యాట్రిక్ సినిమాలు హ్యాట్రిక్ హిట్లు ఒకదానికి మించి మరో హిట్ అందిస్తూ బాలయ్య బోయపాటి కాంబినేషన్ కి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. ఇక సక్సెస్ మీట్ లో బాలయ్య బోయపాటి అఖండ సీక్వల్ కూడా ప్లానింగ్ లో ఉందని తెలుస్తుంది. అదే జరిగితే అఖండ 2 మరింత భారీగా బాక్సులు బద్ధలు కొట్టేలా ఉంటుందని చెప్పొచ్చు. బాలయ్యతో సినిమా తీయాలంటే బోయపాటి తర్వాతే ఎవరైనా అంటూ నందమూరి ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: