“పుష్ప” తో బన్నీ క్రేజ్ నేషనల్ మరియు ఇంటర్ నేషనల్ లెవెల్ లో ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయిందట. ఇందువల్లే నేమో ఇంస్టాగ్రామ్ లో పుష్ప రిలీజ్ అయిన నాటి నుండి ఒక్క నెలలోనే రెండు మిలియన్ల ఫాలోవర్స్ పైగా బన్నీకి యాడ్ అయ్యారు.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “పుష్ప” … విడుదలైన ప్రతి చోట కూడా సెన్సేషనల్ రికార్డ్ లు క్రియేట్ చేసింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా ప్రమోషన్లు చేయకపోయినా కానీ అక్కడి స్టార్ హీరోల సినిమాలకు దీటుగా కలెక్షన్లు సాధించడం అందరికీ కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. నామమాత్రంగా అన్న తరహాలో సినిమా రిలీజ్ చేసిన గాని.. ఊహించని రీతిలో.. “పుష్ప” కి నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు దక్కిందట . బన్నీ పలికిన డైలాగ్ లు అలాగే వేసిన స్టెప్పులు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులను బాగా అలరించాయి.

ముఖ్యంగా ఇంటర్నేషనల్ క్రికెటర్స్ కూడా “పుష్ప” సినిమా డైలాగులు చెప్పడం శ్రీవల్లి సాంగ్ లో బన్నీ వేసిన స్టెప్పులు వేయడం ఆ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేయటంతో సినిమాకి మరింత ప్రమోషన్ లభించినట్లయిందని తెలుస్తుంది.. ఇదిలా ఉంటే బన్నీ “పుష్ప” సినిమాకి ముందు హిందీ లో యూట్యూబ్ లో తన సినిమాలను డబ్ చేయడం అందరికి తెలిసిందే. అయితే ఏ హీరోకి లేని రీతిలో యూట్యూబ్ లో బన్నీ సినిమా లకు భారీ వ్యుస్ వచ్చేవి. పరిస్థితి ఇలా ఉండగా “పుష్ప” నేరుగా హిందీ లో రిలీజ్ చేయడంతో బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో నార్త్ లో బన్నీకి ఉన్న ఫాలోయింగ్ తాజాగా బయటపడిందట.

 

అది ఎలా అంటే ఏకంగా బన్నీకి విగ్రహం కట్టే రీతిలో.. ఫాన్స్ అక్కడ ఉన్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చిందట. విషయంలోకి వెళితే ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన సోహన్ కుమార్ అనే వ్యక్తి .. బన్నీకి చాలా సంవత్సరాల నుండి వీరాభిమానిగా ఉన్నారు ఈ క్రమంలో తన అభిమాన నటుడు సినిమా పుష్ప సూపర్ డూపర్ హిట్ హిందీ లో ఫస్ట్ టైం విజయం సాధించడంతో “పుష్ప” లో గన్ పట్టుకొని ఉండే స్టిల్ కలిగిన విగ్రహాన్ని ఏర్పాటు చేసాడు.. ఇది బన్నీ బర్త్ డే కి కానుకగా ఇవ్వాలని సోహన్ కుమార్ సొంత డబ్బులతో విగ్రహం చేయిస్తున్నట్లు తాజాగా సంఘటన వెలుగులోకి వచ్చిందట.. దీంతో బండి విగ్రహం ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే సెకండ్లపాటు పుష్ప విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు ప్రమోషన్లు భారీ ఎత్తున జరగాలని.. డైలాగులు అదేవిధంగా శ్రీవల్లి టైప్ స్టెప్పులు మళ్లీ సెకండ్ పార్ట్ లో వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: