ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమం బుల్లితెర ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తూ ఉంది. అంతే కాదు ఎంటర్ టైన్ మెంట్ కు  చిరునామాగా మారిపోయింది. అయితే ఒకప్పుడు జబర్దస్త్ లో ఫిమేల్ కమెడియన్స్  ఉండేవారు కాదు. ఫిమేల్ గెటప్పులు కూడా మగవారే వేసేవారు. కానీ ఇటీవలి కాలంలో పురుషులతో సమానంగా కమెడియన్స్ కూడా జబర్దస్త్లో పెరిగిపోతున్నారు. అయితే ఇలా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇస్తున్న లేడి కమెడియన్స్ లవ్ ట్రాక్ నడుపుతున్నట్లు చేయడం ఇక ఆ లవ్ ట్రాక్ కాస్త ప్రేక్షకులను తెగ ఆకర్షించడం జరిగిపోతోంది. గతంలో జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చిన వర్ష ఇమాన్యుల్ తో లవ్ ట్రాక్ నడిపి తెగ ఫేమస్ అయిపోయింది.


 ఇక వీరిద్దరిని జబర్దస్త్ బ్లాక్ అండ్ వైట్ జోడీ అంటూ పిలవడం కూడా మొదలుపెట్టారు అభిమానులు. ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి కొత్త లవ్ ట్రాక్ తెర మీదికి వస్తుంది. అదే రాకింగ్ రాకేష్ సుజాత లవ్ స్టోరీ. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుజాత ఇక జబర్దస్త్ లో రాకింగ్ రాకేష్ టీంలో కామెడీ పంచుతూ ఉంది. అయితే రావడం రావడమే రాకేష్  తో లవ్ లో పడిపోయింది సుజాత. ఇది ఎవరో చెబుతుంది కాదు రాకేష్ సుజాత పలుమార్లు  జబర్దస్త్ స్టేజ్ మీద చెప్పేశారు. ఇక ఇటీవల సుజాత రాకేష్ ఎంత డీప్ లవ్ లో కొనసాగుతున్నారు అన్నది ఇటీవలే జబర్దస్త్ ప్రోమో లో వారు చెప్పిన మాటలతోనే అర్ధమైపోయింది.



 మొదట కామెడీ స్కిట్ లో భాగంగా ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను వ్యక్తపరుస్తూ కొన్ని డైలాగులు చెబుతారు. స్కిట్ పూర్తవుతుంది. ఇక అప్పుడే కల్పించుకున్న రోజా సుజాత నువ్వు రాకింగ్ రాకేష్ వేరే అమ్మాయి తో ఉంటే ఏం చేస్తావు  అంటూ అడుగుతుంది. అతనంటే నాకు చాలా ఇష్టం మేడం ఒకవేళ అతను వేరే అమ్మాయి తో సంతోషంగా ఉంటాడు అని అనిపిస్తే మాత్రం నేను నా ప్రేమను త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అతను సంతోషమే నాకు ముఖ్యం అంటూ సుజాత కన్నీళ్ళు పెట్టుకుంటుంది. ఇక సుజాత మాటలు విన్న రాకింగ్ రాకేష్  కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇక ఇదంతా చూసిన తర్వాత వీరి మధ్య ఇంత డీప్ లవ్ నడుస్తుందా అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: