ఈ మధ్య హీరోయిన్లు ఏదొక వార్తల్లో నిలుస్తున్నారు.. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు ఎక్కువగా వివాదాలతో బిజీ అవుతున్నారు..ఇలా ఫెమస్ అయిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు.తాజాగా మరో హీరోయిన్ మెడ చుట్టూ వివాదం చుట్టుకుంది. ఆ సమస్యతో సతమవుతున్నారు.సినిమాలకు గుడ్ బై చెప్పిన చాలా కాలం తర్వాత ఆమె మళ్ళీ పాపులర్ అవ్వడంతో జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అసలు హీరోయిన్ ఎదుర్కొంటున్న సమస్య ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఖుషి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలుసు. ఈ చిత్రం లో నటించిన ప్రతి క్యారెక్టర్ అందరికి గుర్తుంది.ఇందులో హీరోయిన్ గా భూమిక నటించగా , రెండో హీరోయిన్ గా ముంతాజ్ నటించింది.తెలుగులో పలు సినిమాల్లో పలు ఐటెం సాంగులు చేసిన ఈ ముద్దుగుమ్మ.. తమిళంలో పలు చిత్రాల్లో హీరోయిన్ గా నటించి అలరించింది. ఆమధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది ముంతాజ్. ఆతర్వాత ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ముంతాజ్ పై గృహహింస కేసు నమోదయింది..విషయాన్నికొస్తే.. ముంతాజ్ ఇప్పుడు చెన్నైలో ఉంటుంది.ఆమె ఇంట్లో కొన్నేళ్లుగా ఉత్తరాదికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు పని చేస్తున్నారు. ఇంటిపనులు ఆ మైనర్ లను వాడుకుంటోంది ముంతాజ్. అయితే వీరిలో ఒక బాలిక ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. ముంతాజ్ తమను వేధిస్తోందని, తమను సొంత ఊరికి కూడా పంపడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతి రోజు చిత్ర హింసలు పెడుతోందని, అసభ్యకరంగా మాట్లాడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు ముంతాజ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇద్దరు బాలికలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.ముంతాజ్ ను అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది.ఈ విషయం పై ముంతాజ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: