బాలీవుడ్లో ఫైర్ బ్రాండ్ గా పేరు పొందింది హీరోయిన్ కంగనా రనౌత్. ఈమె సినిమాల ద్వారా కంటే తన నోటి మాటల వల్ల చాలా ఫేమస్ అవుతూ ఉంటుంది. ఇండస్ట్రీలో ఉన్న వారసులంతా కూడా పనికి రారు అనేది ఆమె అభిప్రాయం. ఈ విషయాన్ని పలు సందర్భాలలో మొహమాటంలేకుండా తెలియజేసింది కంగనారనౌత్. ఇండస్ట్రీలో వారి వెనుక ఎవరూ లేకుండా ఉంటే అప్పుడు వారి ప్రతిభ ఏమిటో తెలుస్తుంది అనేది ఏమి అసలు ఉద్దేశం ఆన్నట్లుగా పలు సందర్భాలలో తెలియజేసింది.

రాజకీయంగా మరియు సిని రంగంలో ఆమె చేసిన వ్యాఖ్యల వల్ల ఆమెకు ఎక్కువగా శత్రువులను తెచ్చిపెట్టింది. అంతే కాకుండా ఆమె ఇమేజ్ కూడా అంతే స్థాయిలో పెరిగిపోయిందని చెప్పవచ్చు. అందుచేతనే ఈమెకు ఫైర్ బ్రాండ్ అనే పేరు కూడా సంపాదించుకుంది. యువ హీరోలు అందరూ కూడా ఈమె తో పెట్టుకోవాలంటే కాస్త భయపడుతూ ఉంటారు ఆమె గురించి ఏదైనా మాట్లాడితే ఆమె ఎలా విరుచుకు పడుతుందో అని భయంతో ఉంటారు. తాజాగా కంగానా ధాకడ్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా విడుదల నేపథ్యంలో ప్రమోషన్లో పాల్గొంది ఈమె త్వరలో ఈ చిత్రం విడుదల కాబోతుంది ఇక ఇందులో నుంచి షి ఈజ్ ఆన్ ఫైర్ అనే పాట ప్రోమో విడుదల చేశారు.

ఈ పాట ప్రోమోను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయడం జరిగింది. అయితే అలా షేర్ చేసిన కొన్ని గంటలకే డిలీట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ విషయం పై క్లారిటీ ఇవ్వలేదు. అమితాబ్ ఆ ప్రోమోను డిలీట్ చేయడం పై కంగనా చాలా విరుచుకుపడింది. ఈయనకు కూడా నేనంటే భయం వేసింది ఏమో అందుకే తన పాటని నుండి డిలీట్ చేశారని లేదంటే ఆయన పై ఎవరైనా ఒత్తిడి తీసుకువచ్చి ఉంటే ఇలా డిలీట్ చేసి ఉండొచ్చని ఆమె అభిప్రాయాన్ని తెలియజేసింది. బాలీవుడ్ లో తన అంటే గిట్టని వాళ్లు చాలామంది ఉన్నారని తెలియజేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: