రెబల్ స్టార్ ప్రభాస్ తో తొలిసారిగా కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్న భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్. హోంబలె ఫిలిమ్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కుతున్న సలార్ మూవీ పై అందరిలోకూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో పక్కా మాస్ రోల్ చేస్తుండగా ఆయనకు జోడీగా అందాల భామ శృతి హాసన్ నటిస్తోంది. భువన గౌడ కెమెరా మ్యాన్ గా పని చేస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీత దర్శకుడు.

ఇప్పటికే కెజిఎఫ్ రెండు భాగాల సినిమాలతో అత్యంత భారీ విజయాలు సొంతం చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాతో కూడా మరొక భారీ విజయం అందుకునేలా సలార్ ని ఎంతో అద్భుతంగా తీస్తున్నట్లు ఇన్నర్ వర్గాల టాక్. ఇటీవల నలభై శాతం షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ నేటి నుండి ప్రారంభం అయింది. అయితే విషయం ఏమిటంటే, సలార్ మూవీ మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కనుందని ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో వర్గాలు హల్చల్ చేయడంతో మొన్న కెజిఎఫ్ 2 ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ని మీడియా వారు ఈ విషయం ప్రస్తావించడంతో ప్రస్తుతం తమకు ఆలోచన లేదని, సలార్ కేవలం ఒకటే సినిమా మాత్రమే అని ఆయన అన్నారు.

అయితే ఇటీవల రెండు రోజులుగా పలు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం అవుతున్న పలు కథనాలని బట్టి పక్కాగా ప్రభాస్ సలార్ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కే ఛాన్స్ ఉందని, అయితే రెండవ భాగం విషయం ఇప్పటికిప్పుడు యూనిట్ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదని, దానిపై త్వరలో అఫీషియల్ గా ప్రకటన రానుందని, సలార్ ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కి సీక్వెల్ తీసే స్కోప్ ఉండడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం ఇటీవల తీసుకున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఇది ప్రచారంలో ఉన్న వార్త మాత్రమే అని, దీనిపై సలార్ టీమ్ నుండి అఫీషియల్ అనౌన్స్ వచ్చే వరకు నమ్మలేం అని అంటున్నారు విశ్లేషకులు

మరింత సమాచారం తెలుసుకోండి: