క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ దర్శకుడు వినోదాత్మక మరియు సందేశాత్మకంగా ఉండే మూవీ లను తెరకెక్కించి తన మూవీ లతో ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి ప్రశంసలను అందుకని టాలీవుడ్ ఇండస్ట్రీ లో దర్శకుడి గా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు . 

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రియేటివ్ దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించుకున్న కృష్ణ వంశీ గత కొంత కాలంగా మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందు కోవడం చాలా వరకు వెనుక బడి పోయారు . చందమామ మూవీ తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకున్న కృష్ణ వంశీ ఆ తర్వాత వరుసగా మొగుడు , గోవిందుడు  అందరి వాడేలే , నక్షత్రం వంటి మూవీ లతో అపజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందుకున్నాడు . ఇది ఇలా ఉంటే తాజాగా కృష్ణ వంశీ 'రంగ మార్తాండ' అనే సినిమా కు దర్శకత్వం వహించాడు .

అందులో భాగంగా తాజాగా కృష్ణ వంశీ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ... హిట్ కోసం నేను ఎప్పుడూ మూవీ లు తీయలేదు .  మూవీ తీసిన తర్వాత జనాలకు నచ్చితే ఆ సినిమా హిట్ అవుతుంది అని భావించేవాడిని . కేవలం విజయవంత మైన సినిమా  లను మాత్రమే తీయాలి అనుకుంటే అప్పటికి విజయవంతమైన ఫార్ములా సినిమాలను మాత్రమే తీసే వాడినే కదా . ప్రస్తుతం కూడా కావాల్సింది విజయమే అనుకుంటే కమర్షియల్ మూవీ నే తెరకెక్కించే వాడను కదా ...  రంగ మార్తాండ లాంటి మూవీ ని ఎందుకు తీస్తాను అని తాజా ఇంటర్వ్యూ లో కృష్ణ వంశీ చెప్పు కొచ్చాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: