తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ తాప్సి ఝుమ్మంది నాదం సినిమాతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి పరిచయమయ్యింది. ఈ ముద్దుగుమ్మకు తెలుగులో భారీ కమర్షియల్ సినిమాలలో నటించిన అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది కానీ బడా హీరోలతో వరుసగా నటించే అవకాశాలను మాత్రం దక్కించుకుంది. అయితే మొదట టాలీవుడ్ లో వరుస సినిమాలలో సందడి చేసిన తాప్సి ఆ తర్వాత అంతగా ఆకట్టుకోలేకపోయింది అలా తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే ఈమె హిందీ,తమిళ వంటి భాషలలో సినిమాలు చేసే ప్రయత్నం చేసింది. హిందీలో తాప్సికంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కిస్తూ ఉన్నది.


అయితే కొన్ని కమర్షియల్ సినిమాలలో నటించిన అవి పెద్దగా ఆకట్టుకోలేదు దాంతో పూర్తిగా తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తే బాగుంటుందని ఆమె అభిమానుల సైతం భావిస్తున్నారు. అందుకే ఈమెకు వరుసగా అలాంటి సినిమాలు లోని అవకాశాలు ఇస్తూ సినిమాలు చేసేందుకు బాలీవుడ్ ఫిలిమ్ మేకర్స్ కూడా పలు ఆసక్తికరంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాప్సీ తాజాగా శభాష్ మిధు అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైందని చెప్పవచ్చు.

ఈ ఏడాదిలో ఆమె నుంచి విడుదలైన..విడుదల కాబోతున్న సినిమాలు దాదాపుగా 10 ఉన్నాయి. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. కమర్షియల్ హిట్లు లేకపోయిన కూడా ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్లను చూసి బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఆశ్చర్యపోతూ ఉన్నారు. హీరోయిన్ తాప్సి టాలీవుడ్ లో ఎలాగైతే తన అదృష్టంతో, అందంతో తన కెరియర్ను నెట్టుకు వచ్చిందో ఇప్పుడు బాలీవుడ్ లో కూడా అలాగే కొనసాగుతూ ఉండడంతో ఆమె సక్సెస్ లేకుండానే తన కెరియర్ను నెట్టుకు వస్తోందని చెప్పవచ్చు. హీరోయిన్గా తాప్సి తెలుగులో ఏ ఒక్క సినిమాల్లో కూడా నటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: