బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఆఖరు గా అమీర్ ఖాన్ 'తగ్స్ ఆఫ్ హిందుస్థాన్' అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు . భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయింది .

ఇలా తగ్స్ ఆఫ్ హిందుస్థాన్ మూవీ తో ప్రేక్షకులను నిరాశ పరిచిన అమీర్ ఖాన్ తాజాగా లాల్ సింగ్ చె డ్డా అనే మూవీ లో హీరోగా నటించాడు . ఈ మూవీ లో అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ లో మరో ముఖ్యమైన పాత్రలో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య కూడా నటించాడు. ఈ మూవీ హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ కి రీమేక్. ఈ మూవీ ని ఆగస్ట్ 11 వ తేదీన హిందీ తో పాటు తెలుగు , తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తాడు. ఇది ఇలా ఉంటే తాజాగా హైదరాబాద్‌ లోని ఏఎంబీ సినిమాస్‌ లో సెలబ్రిటీల కోసం ఈ మూవీ  ప్రత్యేక ప్రీమియర్ షో ను ఏర్పాటు చేశారు.

మూవీ ప్రీమియర్ షో లో అమీర్ ఖాన్, మోనా సింగ్, చిరంజీవి ,  నాగ చైతన్య, నాగార్జున, అమల తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రీమియర్ షో అనంతరం మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవిసినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. ఈ మూవీ ని తెలుగు లో నేను అందిస్తున్నందుకు గర్వంగా ఫీలవుతున్నాను. తెలుగు ప్రేక్షకులు ఈ మూవీ కి కచ్చితంగా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: