జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లకు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు.. ఈ షో ద్వారా ఎంతోమంది పాపులర్ అయిన సెలబ్రిటీలలో షబీనా కూడా ఒకరు. పెళ్లిచూపులు షో ద్వారా బుల్లితెరపై తన కెరీర్ ను మొదలు పెట్టింది షబీనా. బుల్లితెరపై సీరియల్స్ లో కూడా నటించి ఊహించని స్థాయిలో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ లో కెవ్వు కార్తీక్ టీమ్ లో చేసిన స్కిట్ల ద్వారా బాగా పాపులర్ అయింది ఈమె. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉండే షబీనా సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఇక ఈమె వేశే పంచులు కూడా బాగా పేలుతూ ఉండడంతో మరిన్ని స్కిట్లలో నటించే అవకాశాన్ని సంపాదించుకుంది. అయితే ఈమె ఎప్పుడూ కూడా వివాదాలలో తల దూర్చలేదు.. అందుచేతనే ఈమెకు అంత క్రేజీ పెరిగిపోయింది. అయితే తాజాగా షబీనా కు సంబంధించి నిశ్చితార్థం ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా ఈమె ఆ ఫోటోలను షేర్ చేసింది ప్రస్తుతం ఈమె నిశ్చితార్థం ఫోటోలు వైరల్ గా అవుతున్నాయి. ఈమె మున్నా అనే వ్యక్తిని వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం.షబీనా పెద్దలు కుదిర్చిన వివాహనే చేసుకోబోతున్నట్లు తెలుస్తున్నది వరుడు కూడా ఈమె కుటుంబానికి చాలా దగ్గర వ్యక్తి అన్నట్లుగా సమాచారం. అయితే వీరి వివాహం ఎప్పుడు అన్నది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. షబీనా కు పెళ్లి కుదరడంతో ఈమె అభిమానుల సైతం చాలా సంబరపడిపోతున్నారు. ఇక ఈమె కలకాలం సంతోషంగా ఉండాలని కూడా ఆమె అభిమానులు సైతం కోరుకుంటూ పలు విధాలుగా కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇమే వివాహమైన తర్వాత టీవీ షోలలో కొనసాగిస్తుందో లేదో అన్న విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది. అయితే తన భర్త గురించి ఏమైనా విషయాలు తెలియజేస్తుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: