ఇప్పుడు అందరూ బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీపై ఇండస్ట్రీలో మంచి అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. అయితే అటు బాలయ్య ఇటు అనిల్ రావిపూడిలకు వేర్వేరుగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.ఇకపోతే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని గతంలోనే వార్తలు ప్రచారంలోకి రాగా ఈ సినిమా బడ్జెట్ గురించి తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు.కాగా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. 

ఇదిలావుంటే అటు బాలయ్య ఇటు అనిల్ రావిపూడి ప్రస్తుతం సక్సెస్ లో ఉన్నారు.అయితే  బాలయ్య సినిమా అంటే మూవీలో భారీ యాక్షన్ సన్నివేశాలు తప్పనిసరిగా ఉండాలనే సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం జై బాలయ్య సినిమాలో నటిస్తున్న బాలకృష్ణసినిమా షూటింగ్ పూర్తైన వెంటనే తర్వాత సినిమా షూటింగ్ పనులను మొదలుపెట్టనున్నారు.కాగా అఖండ సినిమా నుంచి వరుసగా బాలయ్య సినిమాలకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.అయితే అఖండ బీజీఎంకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో బాలయ్య సైతం థమన్ కు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

పోతే  80 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ తెరకెక్కనుంది.  అయితే బాలయ్య కెరీర్ లో ఈ స్థాయి బడ్జెట్ తో ఇప్పటివరకు మరే సినిమా తెరకెక్కలేదు.ఇకపోతే బాలయ్య సినిమాలకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తున్న నేపథ్యంలో నిర్మాతలు సైతం భారీ బడ్జెట్ కు అంగీకారం తెలిపారని బోగట్టా.  అయితే అఖండ 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కినా ఆ సినిమా నిర్మాతలకు 20 కోట్ల రూపాయల రేంజ్ లో లాభాలు వచ్చాయి.ఇక  బాలయ్య అనిల్ రావిపూడి మూవీకి 15 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. పోతే ఈ సినిమాలో బాలయ్య కూతురి రోల్ లో శ్రీలీల కనిపించనున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: