దర్శకుడు తేజ ఒకప్పుడు ప్రేమకథా సినిమాలను ఎలా తెరకెక్కించాలో చూపించి ఆ సినిమాలను రూపొందించి భారీ సక్సెస్ లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ తర్వాత కూడా అదే రకమైన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయ్యాడు. దాంతో ఆయన సినిమాలకు పెద్దగా ఆదరణ దక్కలేదు. ప్రేక్షకులు ఆదరించని సినిమాలను చేసి వరుసగా ఫెయిల్యూర్ అవుతూ వచ్చిన తేజ చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు ఓ ప్రేమకథ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. సురేష్ బాబు రెండవ తనయుడు అభిరామ్ హీరోగా ఆయన అహింస అనే ఓ సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే.

 హిత్రం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దర్శకుడుగా పరిచయమైన తేజ ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. నువ్వు నేను, జయం, నిజం వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈ దర్శకుడు ఇప్పడు ఈ అహింస సినిమాను కూడా ఆ సినిమాల తరహాలోనే తెరకెక్కించడం కొంతమంది తేజ అభిమానులను అనుమాన పరుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్, ఒక పాట సేమ్ జయం, నువ్వు నేను వంటి సినిమాల తరహాలోనే ఉండడంతో అప్పటి ప్రేక్షకుల అభిరుచి ఇప్పటి ప్రేక్షకుల అభిరుచి మారడంతో వారు ఈ సినిమాను ఎంతవరకు ఆదరిస్తారు అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని వారు చెప్పుకుంటున్నారు.

ట్రెండ్ మారిన నేపథ్యంలో తేజ తన ట్రెండు మార్చకుండా ఈ విధంగా సినిమాలు చేయడం ఎంతవరకు అది ఆయనకు విజయాన్ని తెచ్చి పెడుతుందో చూడాలి. మరి అహింస సినిమా త్వరలోనే విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా తేజకు సరైన విజయాన్ని తెచ్చిపెడుతుందా మంచి కం బ్యాక్ ఇస్తుందా అనేది చూడాలి. ఇటు హీరో అభిరామ్ కి కూడా ఇది డెబ్యూ సినిమా. 

మరింత సమాచారం తెలుసుకోండి: