విక్టరీ వెంకటేష్ ఇంకా రానా దగ్గుబాటి తొలి సారి ఈ ఇద్దరూ కలిసి ప్రముఖ పాపులర్ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ కోసం రంగంలోకి దిగారు.ఈ ఇద్దరు కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ డ్రామా 'రానా నాయుడు'. కరణ్ అన్షుమన్ సుపర్ణ్ ఎస్. వర్మ సంయుక్తంగా ఈ వెబ్ యాక్షన్ డ్రామాని రూపొందించారు. అమెరికన్ సిరీస్ 'రే డొనోవన్' అడాప్ట్ చేసుకుని ఈ సిరీస్ ని ఇండియన్ నేటివిటీకి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి తెరపైకి తీసుకొచ్చారు.ముంబై హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ సిరీస్ ని రూపొందించారు. విక్టరీ వెంకటేష్ మునుపెన్నడూ కనిపించని విధంగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో గ్యాంగ్ స్టార్ గా కనిపించబోతున్నారు. రానా అతనికి ఎదురెళ్లే పవర్ ఫుల్ పాత్రలో నటించాడు. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ యాక్షన్ థ్రిల్లర్ త్వరలో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో శనివారం గ్లింప్స్ పేరుతో నెట్ ఫ్లిక్స్ టీజర్ ని విడుదల చేసింది.హిందీలో రూపొందిన ఈ సీరీస్ టీజర్ టెర్రిఫిక్ గా వుంది.


దగ్గుబాటి వర్సెస్ దగ్గుబాటి అంటూ నెట్ ఫ్లిక్స్ షేర్ చేసిన టీజర్ ఇంటెన్స్ డ్రామాగా వుండనున్నట్టుగా తెలుస్తోంది. గత కొంత కాలంగా ఈ సిరీస్ కోసం దగ్గుబాటి ఫ్యాన్స్ తో పాటు ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రానా నాయుడుగా రానా నాగ పాత్రలో విక్టరీ వెంకటేష్ పోటీ పోటీగా నటించారు.సెలబ్రిటీలకు గ్యాంగ్ స్టర్లతో సమస్యలు తలెత్తితే రానా ముఖానికి మాస్క్ ధరించి క్రికెట్ బ్యాట్ తో రంగంలోకి దిగడం.. విచక్షణా రహితంగా క్రికెట్ బ్యాట్ తో హత్య చేయడం రానా స్పెషాలిటి.. అలాంటి రానాని కొట్టాలంటే నాగనే కరెక్ట్ అని గ్యాంగ్ స్టర్స్ నమ్ముతుంటారు. రానా నాగ విడిపోయిన తండ్రీ కొడుకులు.. ఈ ఇద్దరి మధ్య సాగే వైరం నేపథ్యంలో హార్ట్ కోర్ సన్నివేశాలతో ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఈ సిరీస్ ని ఆత్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించారు.ఖచ్చితంగా ఈ సిరీస్ గుర్తుండిపోయే హిట్ కావడం పక్కా అని దగ్గుబాటి ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో వున్నారు. మరి చూడాలి ఈ సిరీస్ ఎలా మెప్పిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: