చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమా ప్రమోషన్స్ చిత్ర బృందం ఇటీవల కాలంలో శరవేగంగా చేయడం జరుగుతోంది. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అయినా సల్మాన్ ఖాన్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉండడం విశేషమని చెప్పవచ్చు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు,టీజర్లు సాంగ్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ నయనతార చిరంజీవి చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసినదే.. అయితే ఈ ఈ విషయంపై చిరంజీవి తాజాగా మాట్లాడడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం.గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.. అయితే చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడుతూ.. చిరంజీవి సినిమా అంటే హీరోయిన్స్ లేకుండా తమ అభిమానులు ఊహించుకోలేరు కానీ అలా నటించిన సినిమాలు ఏవి లేవని కూడా తెలియజేశారు చిరంజీవి. గతంలో హీరోయిన్గా మెప్పించిన నయనతార ఇప్పుడు చిరంజీవి చెల్లెలి పాత్రలో నటించడంపై చిరంజీవి ఇలా స్పందిస్తూ.. ఈ సినిమాలో నయనతార క్యారెక్టర్ కు కరెక్ట్ గా అని అందరం భావించుకున్నాము అందుచేతనే ఆమెకు కథ చెప్పగానే ఓకే చెప్పింది అని తెలియజేశారు.ఆమె ఈ చిత్రంలో ఎంతో అద్భుతంగా నటించింది.. హీరో హీరోయిన్స్ గా చేసిన మేము సినిమాలలో అన్నా చెల్లెలుగా చేస్తే ఇబ్బందిగా అనిపించలేదా అని ప్రశ్న ఎదురవ్వగా.. ఈ కథ చాలా పవర్ ఫుల్ గా ఉంది కానీ నేను ఎక్కడ వెనక్కి వెళ్లి ఆమె నా సినిమాలో హీరోయిన్గా చేసింది ఇప్పుడు చెల్లిగా అని ఆలోచన కూడా రాలేదని అంత పవర్ ఫుల్ గా నయనతార ఈ పాత్రలు నటించింది అని చిరంజీవి తెలియజేశారు. మరి ఈ పాత్ర చిరంజీవి అభిమానులను నయనతార అభిమానులను మెప్పిస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: