నాగార్జున నటించిన తాజా చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. గత కొంతకాలంగా అభిమానులను అలరించలేకపోతున్న నాగార్జున ఈ చిత్రంతో దసరాబరిలో దిగి ప్రేక్షకులను సైతం అలరించాలని చాలా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం ఎట్టకేలకు ఈనెల 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. మేకర్స్ సినిమా ప్రమోషన్స్ ను చాలా వేగవంతం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్నటి రోజున ఈ సినిమా ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఇక మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు కూడా తెలియజేశారు నాగార్జున.


నాగార్జున తన పొలిటికల్ ఎంట్రీ పై వస్తున్న వార్తలపై కూడా స్పందించడం జరిగింది.వచ్చే ఎన్నికలలో తన వైసిపి పార్టీ తరఫున పోటీ చేయబోతున్నారనే వార్తలపై నాగార్జున మాట్లాడుతూ ఆ వార్తలన్నీ ఆ వాస్తవమని తెలియజేశారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తను పోటీ చేస్తున్నారని వార్తలు గడిచిన 15 సంవత్సరాలుగా వినిపిస్తూనే ఉన్నాయని తెలియజేశారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని కూడా తెలిపారు. అయితే మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్ గా నటించడానికి తాను సిద్ధమే అని తెలియజేశారు. దీంతో గత కొంతకాలంగా నాగర్జున పై వస్తున్న వార్తలకు చెక్ పెట్టారని చెప్పవచ్చు.

ఇక ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా గురించి నాగార్జున మాట్లాడుతూ.. ది ఘోస్ట్ సెంటిమెంటుతో మొదలవుతుందని తనతో సినిమా చేయాలనేది దివాంగత నిర్మాత నారాయణ దాస్ నారంగ్ గారి చివరి కోరిక అని ఆయన కోరిక ప్రకారమే తనయుడు సునీల్ నారంగ్ ను నిర్మాతగా ఈ సినిమాకి ఎంచుకున్నామని తెలిపారు. తనలాగే ఈ సినిమాకి పనిచేసిన వారంతా కూడా యంగర్ సే.. కసి ప్రేమతో ఈ సినిమాని చేశారు ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమా చూడాలి అంటే కచ్చితంగా కంటెంట్ తో పాటు సాంకేతికంగా బాగుండాలని ఈ రెండిటిని డైరెక్టర్ ప్రవీణ్ చస్తారు అతని టీం బాగా రూపొందించారని తెలిపారు నాగార్జున.

మరింత సమాచారం తెలుసుకోండి: