నటురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రత్యేకమైన హీరోయిన్ గా  మంచి పేరు తెచ్చుకున్నారు. దానికి కారణం ఆమె చేసే సినిమాలు, ఎంచుకునే పాత్రలు అని చెప్పొచ్చు. సాయి పల్లవికి మాత్రమే ఇలాంటి మంచి పాత్రలు ఎలా వస్తున్నాయని మిగతా హీరోయిన్స్ కుళ్ళుకునేలా సాయి పల్లవి సినిమాలు ఉంటాయి.

హీరోకి సమానమైన పాత్రలు చేసే హీరోయిన్ ఈ జనరేషన్ లో ఎవరంటే సాయి పల్లవి మాత్రమే అని మనకు బాగా తెలిసిన విషయమే. అదే సమయంలో ఇతర హీరోయిన్స్ చేసిన గొప్ప పాత్రలు గురించి సాయి పల్లవి ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో ఉంది మరీ.

అయితే తాను కోల్పోయిన అద్భుతమైన పాత్రలను తలచుకొని సాయి పల్లవి బాధపడదట. విధిని గట్టిగా నమ్మే ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ తాను ఆ పాత్ర చేయాలని రాసి లేదనుకుంటుందట. తాను మిస్సయిన గుడ్ రోల్స్ గురించి సాయి పల్లవి నాకు రాసి పెట్టి లేదని సరిపెట్టుకుంటుందట కానీ ఏమాత్రం బాధపడరట. ఫిదా, లవ్ స్టోరీ, శ్యామ్ సింగరాయ్ చిత్రాల్లో సాయి పల్లవి పాత్రలు చాలా బలమైన కంటెంట్ కలిగి ఉంటాయి అని చెప్పొచ్చు

ముఖ్యంగా ఫిదా మూవీ లో  అయితే హీరో వరుణ్ తేజ్ ని డామినేట్ చేసేలా సాయి పల్లవి పాత్ర ఉంటుంది మరీ. ఫిదా హిట్ క్రెడిట్ మొత్తం సాయి పల్లవి దే అని చెప్పాలి మనం,కాగా సాయి పల్లవి సడన్ గా చిత్రాలు తగ్గిచ్చారు. ఇది ఆమె అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తుంది. ఇటీవల సాయి పల్లవి నటించిన గార్గి విడుదలైంది అని మనకి తెలిసిందే. ఇక కొత్త చిత్రాల గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. పుష్ప 2 మూవీలో సాయి పల్లవి నటిస్తున్నట్లు ప్రచారం బాగనే జరుగుతున్నా అధికారిక సమాచారం మాత్రం ఏమీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: