తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సంతోష్ శోభన్ "పేపర్ బాయ్" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత సంతోష్ శోభన్ "ఏక్ మినీ కథ" అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ థియేటర్ లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది.

మూవీ కి ప్రేక్షకుల నుండి , విమర్శకులు ఉండే అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత ఈ హీరో మంచి రోజులు వచ్చాయి అనే మూవీ లో హీరోగా నటించాడు  ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది. అలా మంచి రోజులు వచ్చాయి మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరుత్సాహపరిచిన సంతోష్ శోభన్ తాజాగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనే మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో ఫరియ అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా ,  మేర్లపాక గాంధీ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ రేపు అనగా నవంబర్ 4 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.
నైజాం : 90 ప్లస్ .
సీడెడ్ :  35 .
ఆంధ్ర :  110 ప్లస్ .
రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ  235 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది.
ప్రపంచ వ్యాప్తంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ  360 ప్లస్ థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: