అల్లు అర్జున్ హీరోగా పుష్ప రెండవ భాగం సినిమా మొదలు పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసిన సుకుమార్ ఈ చిత్రం యొక్క షూటింగ్ ను మొదలు పెట్టే విధంగా ముందుకు వెళుతున్నాడు. త్వరలోనే దీని యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది అని తెలుస్తుంది. అయితే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ చేయబోయే సినిమా గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతుంది. గతంలో ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తదుపరి సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.

ఈ నేపథ్యంలోనే ఆ సినిమా ఇప్పుడు ఉంటుందో లేదో అన్న అనుమానాలను కొంతమంది సినిమా విశ్లేషకులు కలుగజేస్తున్నారు. ఎందుకంటే పుష్ప సినిమా విడుదలకు ముందు ఒప్పుకున్న సినిమా పుష్ప సినిమా తర్వాత ఆయనకు పెరిగిన క్రేజ్ నేపథ్యంలో ఆ సినిమాను చేస్తాడా లేదా అన్న అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా క్రేజ్ ఆయనకు భారీ స్థాయిలో పెరిగిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఇప్పుడు బాలీవుడ్ దర్శకులతో సినిమాలు చేసే విధంగా ఆలోచనలు చేస్తున్నాడు.

ఆ విధంగా ఒకవేళ అదే నిజమైతే కనుక బోయపాటి శ్రీను మరొక హీరోను వెతుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వీరి కలయికలో గతంలో వచ్చిన సరైనోడు చిత్రం మంచి విజయాన్ని అందుకోగా ఈ రెండవ చిత్రం ముందుకు వెళుతుందా లేదా అన్న అనుమానాలను కలుగుతున్నాయి. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ఇప్పుడు పూర్తి దృష్టి పుష్ప రెండో భాగం పైన పెట్టాడని తెలుస్తుంది. ఈ సినిమా ను మొదలుపెట్టి వచ్చే ఏడాది దసరా కి విడుదల చేయాలనీ భావిస్తున్నాడు. ఈ సినిమా యొక్క షూటింగ్ కోసం విదేశాల్లో అయన లొకేషన్స్ వెతుకుతున్నారు. బ్యాంకాక్ అడవుల్లో ఈ సినిమా ను చేయడం చూస్తుంటే ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ను ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయి కి మార్చినట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: