బుల్లితెర పై ఇప్పటి వరుకు ప్రసారమైన బిగ్ బాస్ సీజన్స్ అన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యాయి..అయితే  రీసెంట్ గా ప్రసారమవుతున్న సీజన్ 6 కి మాత్రం ప్రారంభం నుండే దెబ్బ పడింది..ఇక అతి తక్కువ TRP రేటింగ్స్ తో ప్రారంభమైన ఈ సీజన్ వారాలు గడిచే కొద్దీ ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకులను అలరిస్తూ TRP రేటింగ్స్ ని పెంచారు..ఇక ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ రెండవ సీజన్ నుండి ఓటీటీ వెర్షన్ తో కలిపి 5 సీజన్స్ కి అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వచ్చాడు.ఇదిలావుంటే ఇక బిగ్ బాస్ షో అంటేనే అసలు ఇష్టం లేదని చెప్పిన 

నాగార్జున ఇన్ని సీజన్స్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..నాగార్జున బిగ్ బాస్ జర్నీ ఈ సీజన్ తో ముగియబోతుందని తెలుస్తుంది..అయితే దానికి కారణం పారితోషికం విషయం లో అక్కినేని నాగార్జున కి బిగ్ బాస్ యాజమాన్యం కి ఇటీవల ఏర్పడిన విభేదాలే కారణమని ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.అసలు విషయానికి వస్తే ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో కి వ్యాఖ్యాతగా వ్యవహరించినందుకు గాను అక్కినేని నాగార్జున కి ఒక్కో సీజన్ కు 3 నుండి 5 కోట్ల రూపాయిల వరుకు రెమ్యూనరేషన్ ఇచ్చేవారట..ఇకపోతే సీజన్ 6 కి అగ్రిమెంట్ ప్రకారం 6 కోట్ల రూపాయిల వరుకు ఇస్తామని డీల్ కుదిరించుకున్నారట..

కానీ ఇక  సీజన్ ప్రారంభం లో నిర్వాహకులకు చాలా నష్టం వాటిల్లింది అట..అయితే ఆ నష్టాన్ని పూడ్చేందుకు కంటెస్టెంట్స్ కి రెమ్యూనరేషన్స్ దగ్గర నుండి..క్యాష్ ప్రైజ్ వరుకు అన్నిట్లో కోతలు విధిస్తున్నారు..ఇక చివరికి అక్కినేని నాగార్జున రెమ్యూనరేషన్ కి కూడా ఇప్పుడు మూడు కోట్ల రూపాయిల వరుకు కొత్త విధించినట్టు తెలుస్తుంది..ఇది నాగార్జున కి ఏ మాత్రం నచ్చలేదట.అంతేకాదు ఆసక్తికరమైన టాస్కులను డిజైన్ చెయ్యడం లో బిగ్ బాస్ టీం ప్రారంభంలో విఫలమైందని..వాళ్ళు చేసిన తప్పులకు ఇంతమంది బాలవ్వడం నాకేమి నచ్చలేదని..అయితే ఒకవేళ మీరు మంచి టాస్కులని ప్రారంభం నుండే డిజైన్ చేసి ఉంటె ఏరోజు అందరూ బాగుండేవారని..ఇక మీరు చేసిన తప్పులకు నన్ను బాద్యుడిని చెయ్యడం ఏమి బాలేదని నాగార్జున టీం పై ఫైర్ అయ్యాడట..అయితే ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో సెన్సేషనల్ టాపిక్ గా నిలిచింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: