నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో  వీర సింహారెడ్డి సినిమా తెరకెక్కనున్న  సంగతి మనందరికీ తెలిసిందే .ఈ సినిమాలో బాలకృష్ణ కి జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. వీరితోపాటు కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ గా నటిస్తుండగా మరో కీలక పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది .అయితే ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా కూడా ఎనౌన్స్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు బాలయ్య సినిమాపై 

ఒక బ్యాడ్ సెంటిమెంట్ వైరల్ అవుతుంది. అయితే గతంలో సంవత్సరాలు వేరైనప్పటికీ ఇదే తేదీకి బాలయ్య నుంచి కొన్ని సినిమాలు విడుదల కావడం జరిగింది 1990 జనవరి 12న ప్రాణానికి ప్రాణం సినిమా విడుదల కావడం జరిగింది. ఇక ఇందులో రజిని హీరోయిన్గా నటించారు. విడుదల అనంతరం ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ గా నిలిచింది. దాని అనంతరం 2011 జనవరి 12న నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన పరమవీరచక్ర కూడా డిజాస్టర్ గా మిగిలింది 2017 జనవరి 12న బాలకృష్ణ 100 సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి విడుదల కావడం జరిగింది.

 2018 జనవరి 12న జైసింహ విడుదలైంది. ఇక ఈ సినిమా యావరేజ్ గా నిలిచిన గౌతమి పుత్ర శాతకర్ణి మినహా జనవరి 12న విడుదలైన బాలయ్య సినిమాలన్నీ కూడా ఫ్లాప్ గా నిలిచాయి. ఇక ఇలాంటి బ్యాడ్ సెంటిమెంట్ మళ్లీ రిపీట్ అయిందంటే నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం నటించిన వీర సింహారెడ్డి సినిమా కూడా అట్టర్ ఫ్లాపే అవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే నటసింహం నందమూరి బాలకృష్ణ ఈ సెంటిమెంట్ ని దాటుకొని జనవరి 12న హిట్ కొడతాడా లేదా అన్నది చూడాలి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: