ఇప్పుడు ఎక్కడ చూసినా  ప్రేమ పెళ్లిళ్లు ఆ తర్వాత బ్రేకప్ అని అనంతరం డివోర్స్ అన్ని కూడా సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే తాజాగా జబర్దస్త్ లో చిలక గోరింకల్లా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒక జంట ప్రస్తుతం బ్రేకప్ తీసుకుంటున్నారని వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక వారెవరో కాదు పటాస్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ప్రవీణ్ మరియు ఫైమా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.ఈ షో తో వారి  ప్రేమయాయనం మొదలైంది .ఆ షో అనంతరం ప్రవీణ్  పలు షోలు చేస్తూ జబర్దస్త్ లో మంచి గుర్తింపును పొందాడు. 

జబర్దస్త్ షోలో ఆయన కామెడీ సాహసంతో పాటు ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో అందరిని ఎంతో ఆకట్టుకుంటున్నాడు. ఈయనతోపాటు పైమ కూడా ఇలాంటి క్రేజ్ ని అందుకుంది. ఈ షో ద్వారా విపరీతమైన అభిమానాన్ని పొందింది. అయితే తాజాగా ఈమె బిగ్ బాస్ సీజన్ 6 కి కూడా వెళ్లడం జరిగింది. 14 వారాలపాటు షోలో కొనసాగిన ఫైమా ఇటీవల ఎలిమినేట్ అయింది. అయితే ఫైమా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో జబర్దస్త్ ప్రవీణ్ ఏ స్థాయిలో ఆమెను ప్రమోట్ చేశాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్క సోషల్ మీడియా వేదికగా వోట్ చేయండి అంటూ కోరాడు ప్రవీణ్.

ఇక అలాంటి ఫైమ ప్రియుడు ప్రవీణ్ హౌస్ లో నుండి బయటికి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ప్రేమని కలవలేదట .అయితే వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని, పెళ్లి కూడా చేసుకుంటారని వారి పెద్దలు కూడా వీరి పెళ్లికి అంగీకరించారని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు ఫైమా బయటికి వచ్చిన తర్వాత కూడా ప్రవీణ్ ఎందుకు కలవలేదు అనేది ఇప్పుడు చర్చిని అంశంగా మారింది. ఇదిలా ఉంటే జబర్దస్త్ కార్తీక్ ఫైమా ఎలిమినేట్ అయ్యి బయటకు రాగానే కలిశాడు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. కానీ ప్రవీణ్ మాత్రం ఎలాంటి వీడియోలు కూడా కనిపించకపోవడం ఇప్పుడు  అందరిలో ఆసక్తి పోతోంది .అయితే మరి కొందరు మాత్రం పైమా విన్నర్ కాలేక పోయింది కాబట్టి ప్రవీణ్ బాధతో రాలేదు అని.. మరి కొంతమంది వాళ్ళిద్దరికీ బ్రేకప్ అయ్యింది అనే కామెంట్లు సైతం చేస్తున్నారు దీంతో ఈ వార్త కాస్త వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: