
సాధారణంగా ప్రభాస్ తన సినిమా ఈవెంట్లు తప్ప ఇతర హీరోల సినిమా ఈవెంట్లకు కానీ ఇంటర్వ్యూలకు కానీ అసలు హాజరవ్వడు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవల మొదటి సారి బాలయ్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ అనే కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చాడు. ఇక ఇటీవల ఈ ఎపిసోడ్ సృష్టిస్తున్న రేటింగ్ సెన్సేషన్ అంతా ఇంతా కాదు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ షోలో భాగంగా ప్రభాస్ తాను అప్పుల్లో కూరుకుపోయాను అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు.
అయితే ఒక్క సినిమా ఇక ప్రభాస్‌ను అప్పుల నుంచి గట్టెక్కించిందట. ఆ ఒక్క సినిమా ఏది అంటే అందరూ బాహుబలి అని చెబుతూ ఉంటారు. కానీ బాహుబలి కాకుండా మరో సినిమా ప్రభాస్ అప్పులు తీర్చేసిందట. అయితే ప్రభాస్ అప్పుల్లో ఉన్న సమయంలోనే రాజమౌళి సినిమాకు కమిట్ అయ్యాడట. కానీ రాజమౌళి సినిమా అంటే లేట్ అవుతుంది కాబట్టి మధ్యలో రెండు ఆఫర్లు వస్తే ఇక ఆ సినిమాలు చేసేందుకు రాజమౌళి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడట. రెబల్ లో నటిస్తే ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఆ తర్వాత యువి క్రియేషన్స్ పేరుతో సొంత బ్యానర్ ప్రారంభించి కొరటాల శివతో మిర్చి సినిమా చేశాం. అది పెద్ద హిట్ అయింది. ఇక ఈ సినిమాతో తన అప్పులు తీరిపోయాయి అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్.