నందమూరి నటసింహం బాలకృష్ణ గతం లో  వివాదాల్లో చిక్కుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఆ వివాదాలకి గానూ బాలయ్య గతంలో తీవ్ర స్థాయిలో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఇందులో భాగంగానే పలు సందర్భాల్లో బాలయ్య చేసిన కామెంట్లకి గాను క్షమాపణలు కూడా చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇటీవల బాలకృష్ణ నటించిన అఖండ మరియు వీరసింహారెడ్డి సినిమాలతో సక్సెస్ బాట పట్టి ఆయన మార్కెట్ ను రెట్టింపు చేసుకున్నాడు బాలకృష్ణ. ఇందులో భాగంగానే బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాప్ ఫుల్ షో తో ఈయన స్థాయి మరింత పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే బాలయ్య నెక్స్ట్ సినిమాతో మళ్ళీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటాడు అని అందరూ భావిస్తున్న తరుణంలో ఎవరు ఊహించిన విధంగా మళ్ళీ ట్రోల్స్ కి గురవుతున్నాడు బాలకృష్ణ. ఇటీవల బాలకృష్ణ హనీ రోజ్ తోమధ్యం తాగుతూ దిగిన కొన్ని ఫోటోల్లో సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతూ ఎంతటి నెగిటివ్ కామెంట్లను అందుకుంటున్నాయో మనందరికీ తెలిసిందే.అయితే ఈ తరుణంలోనే బాలకృష్ణ అక్కినేని తొక్కినేని అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అయితే ఇలా వరుసగా జరిగిన ఈ రెండు ఘటనల వల్ల బాలయ్య ఇమేజ్ డామేజ్ అయింది అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు.

 ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ మీడియా ముందుకు వచ్చి అక్కినేని తొక్కినేని అని చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్తే ఈ వివాదం సర్దుమని అవకాశం ఉంది అని చాలామంది తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు..ఈ వివాదాన్ని అక్కినేని హీరోలు సైతం పెద్దది చేయాలి అని భావించడం లేదు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో అయినా ఈ వివాదంపై బాలకృష్ణ నోరు విప్పితే బావుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఇందులో భాగంగానే బాలయ్య షో కి అక్కినేని హీరోలు వచ్చే అవకాశం ఏమాత్రం లేదు అన్న కామెంట్లు సైతం ఇప్పుడూ సోషల్ మీడియా వేదికగా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఈ వార్తలు పై స్పందించి క్లారిటీ ఇస్తే ఈ వివాదం సర్దుమనిగే అవకాశం ఉంది అని కామెంట్లను చేస్తున్నారు!!

మరింత సమాచారం తెలుసుకోండి: