బాలీవుడ్ స్టార్ హీరో బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ మూవీ 'పఠాన్'. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ పై మొదటి నుంచి ఎన్నో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక హిందీలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ ఇంకా అలాగే కన్నడ భాషల్లో కలుపుకుని ఈ పాన్ ఇండియా మూవీ వరల్డ్ లోనే ఎక్కువ థియేటర్లలో రిలీజ్ అయిన ఇండియన్ సినిమాగా రికార్డులు సృష్టించింది 'పఠాన్' మూవీ. ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ కు జోడీగా హాట్ హీరోయిన్ దీపిక పదుకొణె నటించింది.మరో స్టార్ హీరో జాన్ అబ్రహం విలన్ గా నటించాడు. దీంతో జనవరి 25న రిలీజ్ అయిన 'పఠాన్' మూవీ పై తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ అంచనాలు వున్నాయి.


దీనికి తోడు మొదటి రోజు ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ లభించింది.దీంతో ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో వచ్చాయనే చెప్పాలి. 'పఠాన్' సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.96 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.హిందీ ఇంకా తెలుగు వెర్షన్లు కలుపుకుని ఇంత బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ పండితుల నుంచి సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగులో 'పఠాన్' సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు పాజిటివ్ టాక్ రావడంతో ఏకంగా ఈ సినిమా రూ.2.67 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది . ఇక బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.58 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఇక ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 100 కోట్లకు పైగా ఈ సినిమా వసూళ్లు రాబట్టి ప్లాపుల్లో వున్న బాలీవుడ్ ని మళ్ళీ బ్రతికించింది. ఇంకా చూడాలి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: