పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  రాజకీయాల లో బిజీ గా వున్నా కూడా వరుసగా సినిమాలను ఒప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలన్నీ కూడా వరుసగా అన్నట్లు గా షూటింగ్ నూ జరుపుకుంటున్నాయి.

పవన్ కళ్యాణ్ నటించబోతున్న ఒక సినిమా కు గాను హీరోయిన్ పాత్ర లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన సమంత ఎంపిక చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది.సమంత ను ఇటీవలే పవన్ కళ్యాణ్ చిత్ర దర్శక నిర్మాతలు సంప్రదించారని అలాగే ఆమె తన డేట్ల విషయం లో కూడా  సర్దుబాటు చేసేందుకు సమంత అంగీకరించినట్లు  ప్రచారం జరుగుతుంది. సమంత ఇటీవలే మయో సైటిస్ అనే దీర్ఘ కాలిక వ్యాధి నుండి ఆమె బయట పడింది. ఆ వ్యాధి కారణంగా దాదాపు సంవత్సరం కాలం సినిమా లకు దూరంగా నే ఉంది. ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటించాలని ఆమె నిర్ణయించుకుంది.

పవన్ కళ్యాణ్ తో ఇంతక  ముందు సమంత అత్తారింటికి దారేది సినిమా ను చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే పవన్ కళ్యాణ్ తో మళ్లీ సమంత నటించేందుకు గాను ఓకే చెప్పినట్లు సమాచారం.అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ మరియు సమంత ల కాంబినేషన్ కోసం ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే అది కచ్చితంగా మళ్ళీ అత్తారింటికి దారేది సినిమా స్థాయి లాంటి విజయాన్ని అందుకోవడం పక్కా అంటూ అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో అత్తారింటికి దారేది సినిమా కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుంది అంటూ బాగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. పవన్ మరియు సమంత లు కలిసిన నటిస్తే చూడాలని ఉందంటూ అభిమానులు కూడా చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: