సాధారణంగా సినీ ఇండస్ట్రీలో నటీనటుల మధ్య ఫ్రెండ్షిప్ ప్రేమ ఎఫైర్లు సహజీవనం అనేది సహజంగా మనం చూస్తూనే ఉన్నాం. కానీ కొంతమంది మాత్రం తమ తోటి నటీనటులను ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్న వారు కూడా చాలామంది ఉన్నారు. ప్రేమలో పడి డేటింగ్ చేస్తూ ఏడాది తిరగకుండానే బ్రేకప్ పేరుతో విడిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు.కానీ ఇంకొంతమంది మాత్రం పెళ్లి చేసుకొని చాలా బాగున్నారు.మరికొందరు పెళ్లయి సంవత్సరం కూడా గడవకముందే విడాకులు బాట పడుతున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే ఇలా బాలీవుడ్ నటీనటుల్లో గాఢంగా ప్రేమించుకున్న జంటల్లో ఐశ్వర్యరాయ్ సల్మాన్ ఖాన్ కూడా ఉన్నారు. 

వీళ్ళిద్దరూ గతంలో పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్యరాయ్ ఇద్దరూ కలిసి నటించిన చోరీ చోరీ చుప్కే చుప్కే అనే సినిమాల ద్వారా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది.ఇక కొన్నాళ్ల తర్వాత ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమ వరకు వెళ్ళింది. దాంతో వీళ్ళిద్దరూ చాలా ఏళ్లు ప్రేమ ప్రయాణం చేశారు. అప్పట్లో వీరిద్దరి క్లోజ్నెస్ చూసి చాలా మంది వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని భావించారు.కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ జంట బ్రేకప్ చేసుకుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వీరి ప్రేమ విఫలం కావడానికి ఓ హీరోయిన్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక హీరోయిన్ ఎవరో కాదు సొట్ట బుగ్గల సుందరి ప్రీతిజింతా... అయితే గతంలో సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్యరాయ్ ఫోన్లో మాట్లాడుతున్న ఫోన్ కాల్ కి సంబంధించి ఆడియో లీక్ అయ్యింది. ఇందులో భాగంగానే ఐశ్వర్యరాయ్ తో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ప్రీతి జింత తో తాను చేసిన ప్రతి పని గురించి చెప్పుకొచ్చాడు. అంతేకాదు తామిద్దరి మధ్య అన్ని జరిగిపోయాయని మేమిద్దరం కలిసి చాలా చోట్ల తిరిగామని ఇంకా రకరకాల విషయాలను ఐశ్వర్యరాయ్ తో పంచుకున్నాడు సల్మాన్ ఖాన్. ఇక ఆ ఆడియో లీక్ అవడంతో ఆడియోను విన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో ప్రతి జింత వల్ల సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్యరాయ్ మధ్య గొడవలు తలెత్తి తమ ప్రేమ విఫలమైంది అంటూ చాలామంది చెప్పుకొచ్చారు. దీంతో ఈ వార్త విన్న చాలా మంది సల్మాన్ ఖాన్ మరియు ఐశ్వర్య రాయ్ విడిపోవడానికి కారణం ప్రీతిజింతా అని ఆమెని పెట్టుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: