నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలే కాకుండా అన్ స్టాపబుల్ షో కి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో సీజన్ 2 ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. తాజాగా  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మొదటి పార్ట్ స్ట్రీమింగ్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆ షో కి సంబంధించిన రెండవ పాట ఎపిసోడ్ నో వచ్చేవారం స్రీమింగ్ చేయనున్నారు ఆహా బృందం. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కి సంబంధించిన రెండో పాట ఎపిసోడ్ తో ఈ షో ముగుస్తుందని ఆహా ఓటీపీ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారం. 

ఇదిలా ఉంటే ఇక బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో సీజన్ వన్ పూర్తి అయినప్పటినుండి ఇప్పటివరకు ఏదో ఒక సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఈ షో కి వస్తే బాగుంటుందని మెగా మరియు నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో కి  మెగాస్టార్ చిరంజీవి మొదటి ఎపిసోడ్ లో లేదా ఆఖరి ఎపిసోడ్లే వస్తే బాగుంటుందని అంతేకాదు అదే నమ్మకంతో ఉన్నారు మెగా మరియు నందమూరి అభిమానులు. ఈ నేపథ్యంలోనే సీజన్ 2 కూడా మూగియబోతున్న నేపథ్యంలో ఈ ఇద్దరు సీనియర్ హీరోల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఇద్దరు సీనియర్ హీరోలు నటించిన సినిమాలు ఒకేసారి సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే ఒకేసారి వీరిద్దరి సినిమా విడుదల కావడంతో త్వరలోనే మెగాస్టార్ చిరంజీవి బాలయ్య షో కి వస్తాడని అందరూ అనుకున్నారు. అంతేకాదు వీరిద్దరికీ సంబంధించిన ఒక ప్రత్యేక ఎపిసోడ్‌ని కూడా ఆహా వారు ప్లాన్ చేస్తారు అని అందరూ ఎంతో నమ్మకంతో ఉన్నారు.కానీ తీరా ఇప్పుడు చూస్తే అవన్నీ ఉట్టి పుకార్లే అని తేలిపోయాయి అందరూ అనుకున్నట్టు చిరంజీవి బాలయ్య షో కి రాలేదు. చిరంజీవి బాలయ్య షో కి రాకముందే సీజన్ 2 ముగుస్తోంది. ఈ నేపథ్యంలోనే మెగా మరియు నందమూరి అభిమానులు సీజన్ 2 కి మెగాస్టార్ చిరంజీవి రాకపోయినా సీజన్ 3 లో ఖచ్చితంగా వస్తాడని నమ్మకంతో వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఈ రెండు సీజన్లలో రాకపోయినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి సీజన్ 3 లో అయినా వస్తే బాగుంటుంది అని వ్యక్తం చేసుకున్నారు. ఈ క్రమంలోనే నందమూరి మరియు మెగా అభిమానుల కోరిక తీరుతుందా లేదా అన్నది చూడాలి ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: