బాలీవుడ్ లో కరోనా తర్వాత నుండి కలెక్షన్ ల కరువు కొనసాగుతోనే ఉంది. అయితే ఇంతకాలం తర్వాత ఒక్కడొచ్చాడు సార్... మొత్తం కలెక్షన్ ల కరువును వడ్డీతో సహా తీర్చేశాడు ఖాన్ త్రయంలో ఒకరైన షారుఖ్ ఖాన్. గత రెండు వారాల క్రితం విడుదలైన పఠాన్ సినిమా... పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలోనూ ఘనంగా రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని విడుదలైంది. ఈ సినిమాను దేశభక్తి కలిగిన యాక్షన్ ఎంటర్టైనర్ గా డైరెక్టర్ సిద్దార్ధ్ ఆనంద్ తీర్చిదిద్దాడు. సినిమా అవుట్ ఫుట్ ఇంతబాగా రావడానికి యాష్ రాజ్ ఫిలిమ్స్ కూడా ప్రధాన కారణం అని చెప్పాలి. బడ్జెట్ కు ఎక్కడా వెనక్కు తగ్గకుండా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు.

అయితే ఈ సినిమాకు ఊహించని స్థాయిలో వివిధ కారణాల వలన నెగిటివిటీ రావడం విశేషం. అయినప్పటికీ కథ బాగుంటే ఎన్ని నెగటివిటీలు కల్పించినా విజయాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు అని షారుఖ్ ఖాన్ అండ్ టీం నిరూపించి చూపించింది.  అయితే మొదటి షో నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను దక్కించుకుని కలెక్షన్ ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమాలో షారుఖ్ కు జోడీగా దీపికా పదుకునే నటించగా, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో జాన్ అబ్రహం నటించి అలరించాడు. షారుఖ్ ఖాన్ కెరీర్ లో ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ లు సాధించినా పఠాన్ వాటన్నిటినీ మరిపింపచేస్తూ కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్ మూవీగా నిలిచింది అని చెప్పాలి.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు పఠాన్ ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్ల మేర వసూళ్లను అందుకుంది. రెండు వారాల నుండి నిలకడగా వసూళ్లను సాధిస్తూ సౌత్ లోనూ అందరూ మెచ్చిన సినిమాగా బాలీవూడ్ బాద్షా షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ నిలిచింది. ఈ సినిమా ఇంకా ముందు ముందు ఇంకెన్ని కోట్ల వసూళ్లను సాధించి రికార్డులు కోళ్ల కొడుతుందో చూడాలి.
   

మరింత సమాచారం తెలుసుకోండి: