టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయినటు వంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప ది రైస్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో అందాల ముద్దు గుమ్మ రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ప్రస్తుతం వరుస మూవీ లను నిర్మిస్తూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మించగా ... దేవి శ్రీ ప్రసాద్ మూవీ కి సంగీతం అందించాడు. మలయాళ నటుడు పహాధ్ ఫాజల్ ఈ మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... సునీల్ అనసూయ ... రావు రమేష్మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పుష్ప ది రైస్ మూవీ కి కొనసాగింపుగా పుష్ప ది రూల్ మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయ్యి ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది. వైజాగ్ లో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న వ్యక్తులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. దర్శకుడు సుకుమార్ ఈ మూవీ ని మొదటి భాగం కంటే అత్యంత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో పుష్ప సెకండ్ పార్ట్ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: