ప్రస్తుత కాలంలో సినిమా బడ్జెట్ ఏ రేంజ్ లో పెరిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరో పారితోషకం రూ.100కోట్లు ఉంటే సినిమా బడ్జెట్ మరో రూ.100 కోట్లు.. అంటే రూ. 200 కోట్లు సినిమా కోసం కేటాయిస్తున్నారు.. ఉదాహరణకు హీరోలకు ఎక్కువ పారితోషకం ఇస్తే సినిమాపై మరింత బడ్జెట్ కేటాయించినప్పుడు నిర్మాతలకు చుక్కలు కనబడుతున్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వాస్తవానికి హీరోల పారితోషకం పెంచినప్పుడు నిర్మాతలు సినిమాపై ఎక్కువ బడ్జెట్ కేటాయించలేకపోతున్నారు. ఫలితంగా సినిమా క్వాలిటీ తగ్గుతోందని ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న తాజా సమాచారం.

క్వాలిటీ పెంచాలి అంటే హీరోలు తమ పారితోషకాన్ని తగ్గించుకొని.. సినిమా క్వాలిటీ పై దృష్టి పెడితే ఆ సినిమా మరింత సక్సెస్ అందుకుంటున్న అభిప్రాయాన్ని అటు సినీ ప్రేక్షకులు కూడా వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో ఒక సినిమా తెరకెక్కుతోంది అంటే ఒక హీరో పారితోషకం కనీసంరూ. 100 కోట్లకు పైగా ఉంటుంది. అలాంటప్పుడు మిగతా సినిమాపై బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఆలోచన కూడా నిర్మాతలలో కలుగుతూ ఉంటుంది. ఒక సినిమాకు రూ.300 కోట్ల రూపాయలు బడ్జెట్ అనుకుంటే అందులో 150 కోట్ల రూపాయల పారితోషకం నటీనటులకు పోతే మిగతా రూ. 150 కోట్లతో తెరకెక్కించే పాన్ ఇండియా సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేదు అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంపై నిర్మాతలు హీరోలు కలిసి చర్చించుకుంటే సినిమా క్వాలిటీ పెరుగుతుందని అప్పుడు ఆడియన్స్ కూడా ఎక్కువగా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం. ఇప్పటికే కొంతమంది హీరోలు తమ పారితోషకాన్ని తగ్గించుకొని నిర్మాతలకు సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు కూడా రూ.100 కోట్లకు పైగా పారితోషకం తీసుకుంటున్న హీరోలు కూడా తమ పారితోషకాన్ని తగ్గించి సినిమా క్వాలిటీ పెంచాలి అని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: