టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సమంత. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన ఈమె ఆ సినిమా అనంతరం స్టార్ హీరోల సరసన వరుస సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా వెలిగింది. అలాంటి ఒక స్టార్ హీరోయిన్ ఎప్పుడైతే అక్కినేని ఇంటికి కోడలు అయిందో అప్పటినుండి ఈమె రేంజ్ మరింత పెరిగిపోయింది. అనంతరం ఏవో కొన్ని గొడవల వల్ల విడాకులు తీసుకున్న ఈమె అనంతరం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే సమంత నటించిన యశోదా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అనంతరం ఈమె నటించిన మరో లేడీ ఓరియంటెడ్ సినిమా షాకుంతలం విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది.

ఈ క్రమంలోనే సమంత మయోసైటిస్ అనే వ్యాధిబారిన పడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడిప్పుడే సమంత ఆ వ్యాధి నుండి కోలుకుంటుంది. ప్రస్తుతం సమంత సిటాడిల్  ఖుషి వంటి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే తాజాగా సమంతకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.అది ఏంటి అంటే తాజాగా సమంత కొన్ని కోట్ల విలువ చేసే ఒక ఇల్లును కొలువులు చేసింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ ఇల్లు హైదరాబాద్ చెన్నైలో కాదు ముంబైలో. అది కూడా బాగా ధనవంతులు ఉండే ఏరియాలో సమంత ఒక ఇంటిని కొనుగోలు చేసిందట. అయితే తాజాగా సమంత తన సోషల్ మీడియా వేదిక ఒక పోస్ట్ ను షేర్ చేయడం జరిగింది.

సన్ సెట్ కి సంబంధించిన ఒక ఫోటోను సమంత పెట్టడం జరిగింది. ఆ ఫోటోలో క్షుణ్ణంగా పరిశీలిస్తే అది ఫైవ్ స్టార్ హోటల్లో నుండి దిగిన ఫోటో లాగా అనిపిస్తుంది. కానీ కాదు.. అది నగరంలోని అత్యంత ధనవంతులు ఉండే ఆకాశ హార్మియం నుండి తీసిన ఫోటో లాగా ఉంటుంది.దీనితో ఈ ఫోటో చూసిన చాలా మంది ముంబైలో సమంత ఒక కొత్త ఇంటిని కొనుగోలు చేసిందని..అంతేకాదు ఆ ఇంటి బాల్కనీ నుండి సమంత ఆ ఫోటోని తీసిందని అంటున్నారు. అంతేకాదు సమంత కొనుగోలు చేసిన ఇల్లు త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అని అంటున్నారు. ఆ ఇల్లు ఖరీదు దాదాపు 15 కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా సమంత ఇన్ని కోట్లు ఖర్చు చేసి ఇల్లు కొనడం పెద్ద ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. ఎందుకు అంటే ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తు బిజీగా ఉన్న సమంత కోట్లలో రెమ్యూనరేషన్ తీసుకుంటుంది కాబట్టి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: