

అందుకోసం పాపులర్ అయినటువంటి హీరోయిన్ తమన్నాను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేయడం జరిగింది. SUREREST ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మార్కెట్లో వేగవంతంగా అభివృద్ధి చెందేందుకు ఈమెతో ప్రమోషన్స్ ను చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా బాగా ప్రసిద్ధి చెందినటువంటి తమన్నా ఈ బ్రాండ్ కు ప్రస్తుతం మార్కెట్లో వెళ్లేందుకు సహాయపడుతోంది. ఈ సందర్భంగా నిర్వాహకులు ఉత్తమమాలనే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. సెంచరీ మ్యాట్రిన్ మాట్లాడుతూ.. తమన్నా SUREREST కి వ్యూహాత్మకంగా చక్కగా సరిపోతుందని ఉద్దేశంతోనే మేము ఈమె ఎంచుకున్నాము మా ఫోకస్ మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు దక్షిణాది మార్కెట్ల మీద ఉంచాము అని తెలియజేశారు.
ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే తమన్నాకు సరైన సక్సెస్ లేక దాదాపుగా కొన్ని సంవత్సరాలు పైనే అవుతొంది. తమన్నా ఫెడవుట్ హీరోయిన్ గా కూడ పేరు సంపాదించింది. ఈ మధ్యకాలంలో తమన్నా ప్రేమలో పడిందని విషయం కూడా వైరల్ గా మారుతోంది. బాలీవుడ్ నటుడుని ప్రేమిస్తున్నట్లుగా గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. తమన్నా ప్రస్తుతం చిరంజీవి నటించిన భోళా శంకర సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తున్నది. ఇక అంతే కాకుండా రజినీకాంత్ నటిస్తున్న జైలర్ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హీరోయిన్ తమన్నాకు సంబంధించి ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.