మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత మొదటిసారి నటిస్తున్న చిత్రం విరూపాక్ష. ఈ సినిమాపై అభిమానులను భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పోస్టర్లు.. ప్రేక్షకులను విపరీతంగా అలరించగా.. ఇప్పుడు ఈ సినిమా నుంచి టీజర్ ను కూడా విడుదల చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమారు రైటింగ్స్ , బ్యానర్లపై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాకి క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. అలాగే కార్తీక్ దండు ఈ సినిమాకి దర్శకత్వం వహించడం జరిగింది.

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్ విడుదల చేయగా.. ఆ గ్లింప్స్ కి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభించింది . ముఖ్యంగా ఈ గ్లింప్స్ కి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వగా దాంతో భారీ స్థాయిలో పాపులారిటీ లభించింది. వరుస విజయాలతో దూసుకుపోతున్న సంయుక్తమైన ఇందులో హీరోయిన్ గా నటించబోతుండడంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా.. సస్పెన్స్ , థ్రిల్లర్ హారర్ మూవీ గా ఉండబోతుందని తెలుస్తోంది..

చరిత్రలో ఇలాంటి ఘటన జరగడం ఇదే మొదటిసారి.. ఈ ఘటన నుంచి బయటపడడానికి ఒకే ఒక్క మార్గం ఉంది.. అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలవుతుంది.. ఒక ఊరు.. ఆ ఊరిలోని జనాల మూఢనమ్మకాలు.. ఒక సమస్య వల్ల వరుస చావులు.. ఆ మిస్టరీని రివీల్ చేయడానికి వచ్చిన హీరో.. ఇప్పుడు ఇదే థీమ్తో విరూపాక్ష టీజర్ ను రిలీజ్ చేయడం జరిగింది. చాలా సస్పెన్స్ అండ్ ఇంటెన్సిటీకి గురి చేసే ఎలిమెంట్స్ ఈ సినిమాలో చాలా ఉన్నట్లు స్పష్టం అవుతుంది.  ముఖ్యంగా విజువల్స్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. సస్పెన్స్ హర్రర్ తో వస్తున్న సాయి ధరంతేజ్ ఈ సినిమాతో సక్సెస్ అవుతారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: