సాధారణంగా అన్నదమ్ముల మధ్య గొడవలు అనేటి సర్వసాధారణంగా వస్తూ ఉంటాయి. కానీ సెలబ్రిటీల ఇళ్లల్లో ఇవి జరిగాయంటే చాలు తరచూ వైరల్ గా మారుతూ ఉంటాయి.గత కొంతకాలంగా మంచు మనోజ్ విష్ణు కి మధ్య మాటలు లేవని వార్తలు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవలే మనోజ్ పెళ్లికి కూడా విష్ణు రాకపోవడంతో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవాలలో మనోజ్ విష్ణు మాట్లాడుకోకపోవడంతో వీరిద్దరి మధ్య గొడవలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకి అర్థమవుతోంది.

తాజాగా మంచు మనోజ్ విష్ణు గొడవ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించి ఒక వీడియో వైరల్ గా మారుతోంది. మంచు విష్ణు మనోజ్ అనుచరుడు సారది ఇంటికి వెళ్లి అతనిపై దాడి చేస్తూ ఉండడంతో తీసిన ఒక వీడియోని తన ఫేస్ బుక్  లో పోస్ట్ షేర్ చేయడం జరిగింది. విష్ణు ఇలా వచ్చి అప్పుడప్పుడు తన మనుషులను కొడుతూ ఉంటారని మనోజ్ తెలియజేయడం జరిగింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతోంది. అంతేకాకుండా ఈ వీడియోలో విష్ణు మనోజ్ కి చెందిన మనుషులపైన కోపడడం కొట్టడానికి ట్రై చేయడం వంటివి జరిగినట్టుగా కనిపిస్తోంది.


ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న వీళ్లు మంచు మనోజ్ వివాహం తర్వాత ఇలా కొట్లాడుకుంటున్నటువంటి వీడియోని షేర్ చేయడంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు రోడ్డుకెక్కాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారడంతో ఈ వీడియో చూసిన అభిమానులు సినీ ప్రముఖులు సైతం ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఈ వివాదం పైన ఇంక ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. విష్ణు కానీ మోహన్ బాబు కానీ ఈ విషయం పైన ఎలా స్పందిస్తారో చూడాలి మరి. క్రమ శిక్షణకు మారుపేరుగా ఉన్న ఈ కుటుంబం ఇలా చేయడంతో అందరూ నోరెళ్ళ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: