
తనకు పని చేసే భార్య ఇష్టం ఉండదు అని మహేష్ చెప్పిన ఒక్క మాటను గుడ్డిగా ఫాలో అయిన నమ్రత ఇక సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది. ఇక ఆ తర్వాత ఎన్ని మంచి ఆఫర్లు వచ్చినా తిరస్కరిస్తూనే వచ్చింది అని చెప్పాలి. అయితే ఇక నమ్రత మహేష్ బాబు ఇద్దరూ కూడా ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమ అభిమానాలను చూపిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇలాంటి దంపతుల మధ్య ఇక ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి చిచ్చు పెట్టబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఎందుకంటే నటనకు దూరంగా ఉన్న నమ్రతను ఇక సినిమాలో అన్న నటింప చేసేందుకు సిద్ధమవుతున్నాడట రాజమౌళి.
మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి. అయితే ఎన్నో ఏళ్ల గ్యాప్ తర్వాత ఇక ఈ సినిమాలో నమ్రత రెండు నిమిషాల పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే మహేష్ బాబు వద్దని చెప్పినా కూడా మొదటిసారి మహేష్ బాబు మాటను కాదని మన నమ్రత ఈ సినిమాలో నటించడానికి ఓకే చెప్పిందట. దీంతో ఇక మహేష్ నమ్రత మధ్య చిన్న పాటి గొడవ జరిగినట్లు కూడా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇది ఎంతవరకు నిజం అన్నది మాత్రం నమ్రత పాత్ర పై అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు ఎవరికీ తెలియదు.